Skin Problems: వర్షాకాలంలో దురద సమస్యగా ఉందా, ఈ చిట్కాలు పాటించి చూడండి

Skin Problems: వర్షాకాలంలో ఇటు వర్షాలు, అటు ఎండల కారణంగా ఆరోగ్య సంబంధ సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో చర్మ సంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు కారణమేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

Skin Problems: వర్షాకాలంలో సాధారణంగా దురద, చర్మ సమస్యలు రకరకాలుగా ఎదురౌతుంటాయి. చర్మంపై చిన్న చిన్న గింజల్లాంటివి ఏర్పడి తరువాత ర్యాషెస్‌గా మారుతుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
 

1 /5

స్కిన్ ఇన్‌ఫెక్షన్ ప్రారంభంలో దురద, మంటతో ప్రారంభమౌతుంది. వర్షాకాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యల్నించి విముక్తి పొందాలంటే ముందుగా కెమికల్స్ ఉండే పదార్ధాలు ముఖ్యంగా సబ్బులు, పెర్ఫ్యూమ్స్, బాడీ వాష్ మానేయాలి.

2 /5

దురద సామాన్యంగా ఉంటే ఫరవాలేదు. ఎక్కువైతే మాత్రం కొబ్బరి నూనె, కర్పూరం, వేప నూనె రాసి తగ్గించుకోవచ్చు.  

3 /5

వర్షాకాలం వచ్చిందంటే చాలు మహిళల్లో స్కిన్ ఎలర్జీ సమస్య ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెడలో ఛైన్, చేతులు, కాళ్లలో గాజులు, పట్టీలు ధరించడం మానేయాలి. లేదా నగలు తగ్గించాలి. ఇవి ధరించినప్పుడు చెమట, దుమ్ము ధూళి కలిసిపోయి చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.

4 /5

కొన్ని సందర్భాల్లో భరించలేని దురద వేధిస్తుంటుంది.  దురద కారణంగా ర్యాషెస్ ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు గోర్లతో ఎప్పుడూ గోకకుండా నియంత్రించుకోవాలి.

5 /5

చర్మం సంబంధిత సమస్యలున్నప్పుడు కాటన్ లేదా తేలికైన బట్టలు ధరించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చెమట వల్ల చర్మ సమస్యలు అధికమౌతాయి. ముఖ్యంగా సింథటిక్, పాలిస్టర్, జరీ, జార్జెట్ బట్టలు దరించకూడదు.