Best Investment Scheme: రూ.7 వేల పెట్టుబడితో రూ.12 లక్షలు.. ఎలా అంటే..?

Best post office scheme: పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల తక్కువ పెట్టుబడితో లక్షల ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా ప్రతినెలా 7వేల రూపాయలను రికరింగ్ డిపాజిట్ స్కీంలో డిపాజిట్ చేయడం వల్ల ఐదు సంవత్సరాల కాల పరిమితిలో రూ.5లక్షల పొందే అవకాశం ఉంటుంది.

1 /5

డబ్బు ఆదా చేయడం అంటే చాలా శ్రమతో కూడుకున్న పని అని అందరూ అనుకుంటారు.  కానీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ లో ప్రవేశపెట్టే పథకాలలో డబ్బు ఆధా  చేయడం వల్ల అనతి కాలంలోనే రెట్టింపు స్థాయిలో డబ్బు పొందడమే కాదు పూర్తి సెక్యూరిటీ కూడా మన డబ్బుకు లభిస్తుంది. 

2 /5

ముఖ్యంగా సంపాదించిన ప్రతి రూపాయి కూడా దాచుకోవాలని, అందుకు ఆదాయం కూడా పొందాలని ఆలోచించేవారు ఎక్కువే. అలాంటి వారి కోసమే ప్రభుత్వ రంగాలు పోస్ట్ ఆఫీస్ లలో కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇటీవల డబ్బు ఆదా అవ్వడమే కాదు రెట్టింపు స్థాయిలో వస్తుంది. అంతకుమించి డబ్బుకు సెక్యూరిటీ కూడా లభిస్తుంది. 

3 /5

ఇకపోతే పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పథకాలలో రికరింగ్ డిపాజిట్ స్కీం కూడా ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి మార్కెట్ రిస్కుల ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన ఈ పథకంలో 6.7% వడ్డీ కూడా లభిస్తుంది. ఇందులో ఐదు సంవత్సరాలు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఆదాయం వస్తుంది. మీరు కావాలంటే ఈ పథకాన్ని ఇంకో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.   

4 /5

ఇందులో కనిష్టంగా రూ.100 పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా పెట్టుబడి పెట్టడానికి పరిమితి లేదు. ఇందులో మీరు చక్రవడ్డీ ప్రయోజనాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రతినెల 7000 రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే ఐదు సంవత్సరాలలో రూ .4,20,000 పెట్టుబడి పొందుతారు. ఐదేళ్లలో మీరు పెట్టిన పెట్టుబడి పై దాదాపు రూ.79,564 లభిస్తుంది. మొత్తం ఐదు సంవత్సరాలలో మీరు సుమారుగా రూ.4,99,564 పొందుతారు. దీని తర్వాత మీరు ఈ పథకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తే సుమారు రూ .12 లక్షలు మీ సొంతం అవుతాయి.

5 /5

అంతేకాదు ఈ పథకంలో ఒక్కరే కాకుండా ముగ్గురు వ్యక్తులు కలిపి జాయింట్ ఖాతా కూడా తెరుచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతినెలా కూడా ముగ్గురు మూడు భాగాలుగా డబ్బు డివైడ్ చేసుకొని కట్టడం వల్ల రిస్క్ ఉండదు. ఐదు సంవత్సరాల లో భారీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.