Carrie fishers iconic gold bikini: ప్రముఖ హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ గతంలో ధరించిన బికినిని తాజాగా వేలం వేశారు. దీన్ని ప్రత్యేకంగా.. ఈ స్టార్‌వార్స్ సినిమా కోసమే బంగారంతో బికినీని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ బికిని ఏకంగా రూ.1.46 కోట్లు పలికి అందరి దృష్టినీ ఆకర్షించింది.
సాధారణంగా కొన్నిసార్లు పురాతన వస్తువులు, అత్యంత అరుదైన వస్తువులను వేలంపాట వేస్తుంటారు.ఫెమస్ నటీ,నటులు వేసుకున్న కాస్ట్యూమ్స్ లను కూడా తరచుగా వేలంపాటను వేస్తుంటారు. ఇదంతా మనం తరచుగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఇవి వేలంపాటలో కోట్ల రూపాయలకు పలకడం కూడా వార్తలలో నిలిచాయి.
తాజాగా, ఒక బికినీ వేలంపాటలో ఏకంగా ఏకంగా రూ.1.46 కోట్లు పలికి అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ప్రస్తుతం ఈ బికినీ ఘటన కాస్త ట్రెండింగ్ గా మారింది. తాజాగా అమెరికాలోని హెరిటేజ్‌లో నిర్వహించిన వేలంలో ఆ బికినీ ధర అందర్నీ ఊహించని విధంగా షాక్‌కు గురి చేసింది.
ఈ బికినీని ప్రఖ్యాత డిజైనర్ రిచర్డ్ మిల్లర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది.. పూర్తిగా బంగారంతో డిజైన్ చేశారు. ఇటీవల నిర్వహించిన వేలంలో ఏకంగా 1.75 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.1.46 కోట్లు పలికింది. 1983 లో విడుదలైన స్టార్‌వార్స్ సినిమాలో దీన్ని ప్రముఖ హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ దీన్ని ధరించారు.
కేవలం.. ఈ స్టార్‌వార్స్ సినిమా కోసమే ఈ బంగారు బికినీని తయారు చేశారు. అయినప్పటికీ.. ఆ బికినీకి గానీ, స్టార్‌వార్స్ సినిమాకు ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని ఆ వేలం నిర్వహించిన జో మద్దలేనా పేర్కొన్నారు. హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్.. 2016 లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ బంగారు బికినీ గురించి మాట్లాడారు.
స్టార్‌వార్స్ సినిమా డైరెక్టర్.. తనకు బంగారంతో చేసిన బికినీ గురించి చెప్పారని, తొలుత తాను నమ్మలేదని అన్నారు . కానీ ఆయన నిజంగానే బంగారు బికినీ తన చేతికి ఇచ్చారని నటి చెప్పుకొచ్చింది. అయితే ఆ బంగారు బికినీని వేసుకున్నపుడు తాను చాలా ఇబ్బంది పడినట్లు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అయితే క్యారీ ఫిషర్ పడుతున్న ఇబ్బందిని గమనించిన ఆ బికినీ డిజైనర్.. దాని లోపలి భాగంలో మృదువైన పదార్థాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కాగా అదే సంవత్సరంలో క్యారీ ఫిషర్ గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు తెలుస్తోంది.