Shani Gochar: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలు ఒక ఎత్తు. శనీశ్వరుడు మరోక ఎత్తు. ఈ గ్రహానికి లేనట్టు.. ఈయన్ని మాత్రమే శనీశ్వరుడుని .. ఈశ్వరుడి స్థానమిచ్చారు. మిగిలిన ఏ గ్రహాలకు అలా లేదు. ఈయన ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నరేళ్లు పడుతుంది.
అందుకే శనీశ్వరుడిని మంద గమనుడు అని పిలుస్తారు. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారిపై శనిదేవుడు అశుభ దృష్టి తొలిగిపోనుంది.
వృషభ రాశి: శని దేవుడు కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశించడం వలన వృషభ రాశి వారు కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు తొలిగిపోతాయి. విజయం మీ చెంత చేరుతుంది. ఆనందం మరియు శాంతి ఇకపై మీ సొంతం.
మిథున రాశి : మిథున రాశి ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలన్ని దూది పింజల్లా ఎగిరిపోతాయి. అంతేకాదు కొన్నేళ్లుగా అనుభవిస్తున్న బాధలు తీరిపోతాయి. ఏది ఏమైనా మీకు ప్రశాంతమైన జీవితం గడుపుతారు.
కర్కాటక రాశి: గత కొన్నేళ్లుగా ఉద్యోగంలో అనుభవిస్తున్న ఒత్తిడులు తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు.ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.
తుల రాశి: శని రాశి మార్పు వలన మీ జీవితంలో ఇకపై మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఆర్థిక లోటును అధిగమిస్తారు.సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలున్నాయి.
కుంభ రాశి: శని రాశి మార్పు వలన కుంభ రాశికి గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న ఏల్నాటి శని కష్టాలు దాదాపు తొలిగిపోయినట్టే.. మరో రెండున్నర యేళ్లు ఉన్నా.. గతంలో కంటే జీవితం మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు గత కొంత కాలంగా ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.