Cleaning of copper vessel: శ్రావణమాసంలో నిత్యం పూజలు ఉంటాయి. ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీవ్రతం జరుపుకుంటారు. పూజకు ఎన్నో వస్తువులు అవసరం ఉంటాయి. ముఖ్యంగా పూజాసామాగ్రి. రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయాలంటే కష్టంగా ఉంటుంది. చింతపండు, నిమ్మకాయ చిట్కాలు అందరూ పాటిస్తుంటారు. అయితే వాటికి ఉన్న నూనె సరిగ్గా పోదు. అయితే మీ ఇంట్లో ఉండే రాగి, ఇత్తడి పాత్రలతో పాటు పూజా సామాగ్రి కొత్తవాటిలా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. అవేంటో చూద్దామా? మరి.
Homemade Cleaning Powder : సాధారణంగా పూజ చేసే సమయంలో రాగి, ఇత్తడి, వెండి వస్తువులను నూనె అంటుకుని జిడ్డులా మారుతుంటాయి. వాటిని క్లీన్ చేయడం చాలా కష్టమైన పనే. పూజా సామాను మాత్రమే కాదు కొంతమంది వంటకాలకు ఇత్తడి, రాగిని ఉపయోగిస్తుంటారు. పూర్వకాలంలో రాగి లేదా మట్టి పాత్రల్లో ఆహారం వండేవారు. ఇందులో వండిన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజుల్లో కూడా కొంతమంది రాగిపాత్రలు, ఇత్తడి పాత్రలను ఉపయోగిస్తున్నారు. అయితే పూజలో, వంటగదిలో వాడే ఈ వస్తువుల జిడ్డు తొలగిపోవాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి. నూనె జిడ్డు తొలగిపోయి తళతళ మెరిస్తుంటాయ్. ఆ చిట్కాలేంటో చూద్దాం.
పౌడర్ తయారీకి కావాల్సిన పదార్థాలు: పిండి, ఉప్పు, డిటర్జెంట్ పౌడర్, సోడా, సిట్రిక్ యాసిడ్, ఫుడ్ కలర్, వెనిగర్, నీళ్లు,
పౌడర్ తయారీ విధానం: రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. దాని ఒక చెంచా పిండి , రెండు చెంచాల ఉప్పు, 5-6 చెంచాల డిటర్జెంట్ పౌడర్ వేయాలి. ఈ మూడింటిని మిక్స్ చేయాలి. ఇప్పుడు మరొ గిన్నెలో 2-3 చెంచాల బేకింగ్ సోడా, 4-5 స్పూన్ల సిట్రిక్ యాసిడ్, చిటికెడు పుడ్ కలర్, అరకప్పు వెనిగర్ వేయాలి. వీటన్నింటిని మిక్సర్ గ్రౌండర్ లో వేయాలి. కొద్దిగా నీళ్లు పోయాలి. గ్రౌండ్ చేస్తే పేస్టు తయారవుతుంది.
ఎలా ఉపయోగించాలి? ఈ పేస్టును ఒక కంటైనర్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు రాగి, లేదా ఇత్తడి పాత్రలను తీసుకుని ఈ పేస్టును వాటికి పూయాలి. పాత్రలను అంతా అప్లయ్ చేసిన తర్వాత అరగంట పాటు నాననివ్వండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే పాత్రలు మెరుస్తుంటాయి. ఈ పేస్టును రెగ్యులర్ గా ఉపయోగిస్తే మీ పాత్రలను కొత్తగా మెరుస్తాయి.
ఉప్పు, వెనిగర్ ఉప్పు, వెనిగర్ తో కూడా పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. ఉప్పు, వెనిగర్ రాగివస్తువుల మీద రాస్తే ఆక్సీకరణం చెందడం తగ్గుతుంది. దీనివల్ల నల్లగా మారవు.
మరో మార్గం ఉప్పు, వెనిగర్ తీసుకుని ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి అందులో టేబుల్ స్పూన్ ఉప్పు, కప్పు వెనిగర్ పోసి..నీళ్లలో ఇవి బాగా కరిగిన తర్వాత అందులో రాగి, ఇత్తడి సామాన్లు వేయాలి. దీన్ని స్టౌ మీద పెట్టి..నీళ్లు మరిగేవరకు అలాగే ఉంచాలి. మురికి మొత్తం నీళ్లలోకి వచ్చేస్తుంది. మీ వస్తువులు మెరిసిపోతాయి.