Immunity Boosting Foods: శీతాకాలంలో ఈ పండ్లు తినండి.. జలుబు, గొంతునొప్పికి దూరంగా ఉండండి

How To Boost Immunity: ప్రస్తుతం తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్‌లో ఇన్‌ఫెక్షన్లు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం చలికాలంలో లభించే పండ్లను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఆ పండ్ల గురించి తెలుసుకోండి.

  • Nov 28, 2022, 15:28 PM IST
1 /5

క్యాన్‌బెర్రీస్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్యకరం. ఇవి చిన్న ఎరుపు రంగు స్వీట్లు. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీని రసాన్ని కూడా తాగవచ్చు.  

2 /5

వింటర్ సీజన్‌లో ఆరెంజ్ మార్కెట్‌లో విరివిగా దొరుకుతుంది. దీనిలో విటమిన్ సి, క్యాల్షియం ఉండడంతో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.   

3 /5

జామ పండును చలికాలంలో తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, డి కాకుండా కాల్షియం, ఫైబర్, ఐరన్ కూడా ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

4 /5

కివి ప్రతి సీజన్‌లో సులభంగా అందుబాటులో ఉంటుంది. కానీ చలికాలంలో దీనిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య ఉండదు. అంతేకాకుండా మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.   

5 /5

సీతాఫలం పండ్లు శీతాకాలంలో కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో కాల్షియం, అనేక ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.