Mosquitoes Removal Tips: వర్షాకాలంలో దోమలు, ఈగలు వేధిస్తున్నాయా, ఈ 5 చిట్కాలు పాటిస్తే దరిదాపుల్లో రావిక

వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు-ఈగల బెడద ఎక్కువవుతుంటుంది. రోజువారీ జీవితం నరకంగా మారుతుంటుంది. వివిధ రకాల రోగాలు చుట్టుముడుతుంటాయి. అయితే కొన్ని సులభమైన 5 చిట్కాలతో దోమలు, ఈగల్ని పారద్రోలవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

Mosquitoes Removal Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు-ఈగల బెడద ఎక్కువవుతుంటుంది. రోజువారీ జీవితం నరకంగా మారుతుంటుంది. వివిధ రకాల రోగాలు చుట్టుముడుతుంటాయి. అయితే కొన్ని సులభమైన 5 చిట్కాలతో దోమలు, ఈగల్ని పారద్రోలవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

1 /6

పుదీనా అంటేనే అద్భుతమైన సువాసన. ఈగలకు ఈ వాసన అస్సలు పడదు. పుదీనా వానసకు దూరం పోతాయి. అందుకే వర్షాకాలంలో చిన్న చిన్న కుండీల్లో పుదీనా పెంచుకుంటే మంచిది. వీటిని కిటీకీలు, తలుపుల వద్ద ఉంచితే ఆ వాసనకు ఈగలు దరిచేరవు

2 /6

సాధారణంగా వర్షాకాలంలో దోమలు, ఈగలు, బొద్దింకలు ఇతర కీటకాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంటుంది. వీటి వల్ల కేవలం అసౌకర్యమే కాకుండా వివిధ రకాల వ్యాధులు కూడా తలెత్తుతుంటాయి. ఆరోగ్యం పాడవుతుంది. వీటి నుంచి తప్పించుకునేందుకు 5 చిట్కాలున్నాయి. 

3 /6

దోమల్ని పారద్రోలేందుకు నిమ్మకాయ, లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రెండింటి వాసన దోమలకు పడదు. ముందుగా నిమ్మకాయల్ని స్లైడ్స్ కింద కోసుకోవాలి. ప్రతి ఒక స్లైస్ లో 4-5 లవంగాలు ఉంచాలి. ఆ తరువాత వీటిని ఇంట్లో అక్కడక్కడా పెట్టుకోవాలి.

4 /6

ఇంట్లోంచి దోమలు, ఈగల్ని పారద్రోలేందుకు వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికోసం వెల్లుల్ని పేస్ట్ చేసుకుని నీళ్లలో ఉడికించాలి. ఆ తరువాత స్ప్రే బాటిల్ లో నింపుకుని ఇంట్లో మూలల్లో పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల దోమలు, ఈగలు పారిపోతాయి.

5 /6

ఇక దోమల బెడద ఎక్కువగా ఉంటే మరో అద్బుతమైన చిట్కా ఉంది. సగం స్పూన్ విక్స్  తీసుుకుని అందులో కొద్దిగా బేకింగ్ సోడా కలపాలి. ఇప్పుడిందులో కొద్దిగా నీళ్లు వేసి మస్కిటో రీఫిల్ నింపుకోవాలి. అంతే రీఫిల్ వాడినట్టు వాడాలి. కాస్సేపట్లోనే ఆ వాసన కారణంగా దోమలు రాలి పడిపోతుంటాయి. 

6 /6

ఇక వర్షాకాలంలో ఎదురయ్యే మరో సమస్య బొద్దింకలు. ఇంట్లో కిచెన్ లో ఎక్కువగా కన్పిస్తాయి. వీటిని పారద్రోలేందుకు పలావు ఆకు ఉపయోగపడుతుంది. దీనికోసం 3-4 డ్రై పలావు ఆకులు తీసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ను బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో వేయాలి. ఈ వాసన పడక అవి దరిచేరవు