Varalakshmi Vratam 2024: రేపు వరలక్ష్మి వ్రతం.. ఆవునెయ్యితో లక్ష్మీదేవికి ఈ పాయసం నైవేద్యంగా పెట్టండి..

Varalakshmi Vratam 2024 Naivedyam: వరలక్ష్మి వ్రతం ఈ ఏడాది ఆగష్టు 16 అంటే రేపు రానుంది. శ్రావణ పూర్ణిమ లేదా రాఖీపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. అయితే, ఈరోజు అమ్మవారిని అలంకరించి పూజలు చేసి నైవేద్యాలు పెడతారు. ఈరోజు మనం అమ్మవారి కోసం సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
 

1 /5

సాధారణంగా లక్ష్మి దేవికి కొన్ని ప్రత్యేక నైవేద్యాలు తయారు చేసి పెడతాం. అయితే, రేపు వరలక్ష్మి వ్రతం మరింత ప్రత్యేకం. ఈ సందర్భంగా అమ్మవారికి ఆవు నెయ్యితో తయారు చేసిన పాయసం పెడితే మరింత శుభం. ఎందుకంటే లక్ష్మి దేవికి తెలుపు రంగు వస్తువులు అంటే ప్రీతికరం.   

2 /5

సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు.. పాలు – 1 లీటర్ సేమియా – 70 గ్రాములు పంచదార – 100 గ్రాములు బాదం, కిస్మిస్‌, జీడిపప్పు ముక్కలు – 7-8  ఆవు నెయ్యి – 2 tsp నీరు - ఓ కప్పు యాలకులు  (పొడి) – 5

3 /5

సేమియా పాయసం తయారీ విధానం.. సేమియా పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసి ఓ ప్యాన్‌ తీసుకోండి. ఇందులోనే కట్‌ చేసిన బాదం, జీడిపప్పు, కిస్మిస్‌ ముక్కలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో నెయ్యి వేసి సేమియాను బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత అందులోనే నీరు పోసి సేమియా ఉడికించుకోండి. మీకు పాలు ఎక్కువగ ఉంటే పాలు పోసి సేమియాను ఉడికించుకోవచ్చు.

4 /5

 ఆ తర్వాత అందులోనే చక్కెర వేసుకోవాలి. అది కరిగే వరకు బాగా కలపాలి. చక్కెర అంతా కరిగి సేమియా ఉడికిన తర్వాత అందులో పాలు పోయాలి. దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. (ముందుగా పాలు మరగకాచుకోవాలని గుర్తుంచుకోండి). అందులోనే యాలకుల పొడి, బాదం, జీడిపప్పు, కిస్మిస్‌ కూడా వేసి బాగా కలపాలి. ఇక్కడ మీరు కస్డర్డ్‌ పొడి కూడా వేసుకోవచ్చు. ఇది సేమియా రుచిని మరింతగా పెంచుతుంది. పాలలో వేసి కస్టర్డ్‌ వేసి ఉండలు పట్టకుండా కలిపి ఈ సేమియాలో వేసుకోవచ్చు. లేదంటే పాలు పొంగినప్పుడు పై నుంచి మరింత నెయ్యి కూడా వేసుకుని మరో 10 నిమిషాలు అయ్యాక స్టవ్‌ ఆఫ్‌ చేయాలి.  

5 /5

వరలక్ష్మి వ్రతం స్పెషల్‌ ఈ సేమియా పాయసం చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ ప్రసాదాన్ని త్వరగా చేసుకోవచ్చు కూడా..(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)