Hyundai Exter Cng Duo: వేరీ చీప్‌ ధరకే బెస్ట్‌ మైలేజీ Hyundai Exeter CNG వచ్చేసింది!

Hyundai Exeter CNG Duo: టాటా మోటార్స్‌కి భారత మార్కెట్‌లో తిరుగు లేని పేరును సంపాదించుకుంది. అయితే ఈ కంపెనీనే హ్యుందాయ్ ఇండియా అనుసరిస్తోంది. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లలను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన మైక్రో SUV Exeterకి మంచి గుర్తింపు లభించింది.
 

1 /7

హ్యుందాయ్ తమ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని CNG సిలిండర్ ట్యాంక్ సెటప్‌తో కొత్త Exeter మైక్రో SUVని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ కొత్తగా Exeter CNG Duo అనే పేరుతో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది.  

2 /7

ఈ Exeter CNG Duo మైక్రో SUV కారు మూడే వేరియంట్స్‌లో అందుబాటులోకి ఉంది. గతంలో కంపెనీ  S, SX వేరియంట్స్‌ను లాంచ్‌ చేయగా, ఇప్పుడు SX నైట్ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. 

3 /7

అలాగే హ్యుందాయ్ కంపెనీ ఇటీవలే లాంచ్‌ చేసిన కారుకు సంబంధించిన ధరను కూడా వెల్లడించింది. ఈ SX నైట్ ఎడిషన్‌ కేవలం ధర రూ. 8.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో లభించనుంది. 

4 /7

ఇక ఈ Exeter CNG Duo కారుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే,  CNG సిస్టమ్‌తో పాటు 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఇది  5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ సెటప్‌తో లభిస్తోంది.

5 /7

ఈ హ్యుందాయ్ ఎక్సెటర్ కారు 60 లీటర్ల CNG సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు లీటర్‌ CNGకి దాదాపు  27.1 km మైలేజీని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. 

6 /7

ఈ కార్ల వేరియంట్స్‌లా వారిగా చూస్తే, కంపెనీ SX Night Edition కారును ధర రూ.9.50 లక్షలు నుంచి ప్రారంభించింది. దీంతో పాటు SX CNG Duo వేరియంట్‌ రూ. 9.00 లక్షలకు అందుబాటులో ఉంది. 

7 /7

హ్యుందాయ్ ఎక్సెటర్ సిఎన్‌జి డుయో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు LED DRL,  LED టెయిల్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది.