రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్. దేశంలో అత్యంత సంపన్నులలో ఒకరైన రతన్ టాటాకు వ్యాపారరంగంలో మిత్రులే తప్ప శత్రువులు లేరంటే ఆయన వ్యక్తిత్వం, హుందాతనం ఏంటన్నది చెప్పవచ్చు. ఇటీవల ముంబైలోని ఓ ఈవెంట్లో ఇన్ఫోసిస్ దిగ్గజం నారాయణ మూర్తి సైతం రతన్ టాటా పాదాభివందనం చేయడం ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఎందుకు వివాహం చేసుకోలేదన్న ఆయన అభిమానుల ప్రశ్నులకు తాజాగా సమాధానం దొరికింది. తన ప్రేమ విషయాన్ని, ఎందుకు లవ్ ఫెయిల్ అయిందో టాటా వివరించారు. హ్యుమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవితంలో కీలక విషయాలను స్వయంగా వెల్లడించారు. ఆయన జీవితంలో ప్రేమ ఎందుకు దక్కలేదో తెలిసి అభిమానులు బాధ పడతారు. (Image courtesy: pinterest)
నాకు వయోలిన్ ప్లే చేయాలని ఉండేది. కానీ నాన్న పియానో వాయించమని చెప్పేవారు. నేను అమెరికాలో చదువుకుంటానంటే, వద్దు యూకేకు వెళ్లమని నాన్న అన్నారు. ఆర్కిటెక్ట్ కావాలన్నది నా ఆశయం కాగా, ఇంజినీర్ అవ్వాలని ఒత్తిడి తెచ్చేవారని తండ్రితో అనుబంధాన్ని రతన్ టాటా గుర్తుచేసుకున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో చేరిన తాను గ్రాండ్ మదర్ సహకారంతో ఆర్కిటెక్చర్లో డిగ్రీ పూర్తిచేసినట్లు వెల్లడించారు.
అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేశారు రతన్ టాటా. అనంతరం లాస్ ఏంజిల్స్‌లో ఆర్కిటెక్ట్ కంపెనీలో జాబ్ చేశానని చెప్పారు. అదే సమయంలో ఓ యువతిని ప్రేమించాను, ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యానన్నారు. నా పెళ్లి ఆమెతో అవుతుందన్న సంతోష సమయంలో అమ్మమ్మకు ఆరోగ్యం క్షీణించడంతో భారత్ వచ్చేశాను. నాతో ఆమె రావడానికి సిద్ధంగా ఉంది. కానీ 1962లో భారత్, చైనాల మధ్య యుద్ధం జరగుతోంది. నాతో కలిసి భారత్‌కు వచ్చేందుకు ఆమె సిద్ధపడ్డా.. ఆమె తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. మా మధ్య దూరం పెరిగింది. ప్రేమ పెళ్లిపీటలవరకు వెళ్లలేకపోయిందని లవ్ స్టోరీని షేర్ చేసుకున్నారు. #HappyValentinesDay Image courtesy: Humans of Bombay
నేడు వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం) సందర్భంగా వ్యాపార దిగ్గజం రతన్ టాటా లవ్ స్టోరీ వైరల్ అవుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రతన్ టాటా లవ్ ఫెయిల్యూరా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈయన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయారు కానీ, ఆమె సంగతేంటి అని కామెంట్లు చేస్తున్నారు. అసలైన ప్రేమ ప్రేమికుల మంచినే కోరుకుంటుంది కదా. #HappyValentinesDay
రతన్ టాటా చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా, సూని టాటా విడాకులు తీసుకున్నారు. దీంతో తాను, తన సోదరుడు చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రేమను అంతగా పొందలేకపోయామని, అయినా బాల్యం చాలా సంతోషంగా గడిచిందన్నారు. అందుకు కారణణం తన అమ్మమ్మ అని చెప్పారు. ఆమె తనకు స్ఫూర్తి అని, తనకు విలువలు, వ్యక్తిత్వాన్ని అందించిన గొప్పవ్యక్తి అని గుర్తుకు చేసుకున్నారు.
Next Gallery