Indian Airforce Recruitment 2024: కేవలం పది ఉత్తిర్ణతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ సంపాదించే సువర్ణ అవకాశం. దీనికి సంబంధించిన ఓ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ పోర్స్ రిక్రూట్మెంట్ విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ ఖాళీల భర్తీలో భాగంగా అగ్నివీర్-వాయు హౌస్ కీపింగ్ , హాస్పిటాలిటీ నాన్-కంబాటెంట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు కేవలం ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
అర్హత.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపడుతున్న ఈ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ సెప్టెంబర్ 2. అయితే, ఈ పోస్టులకు కేవలం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. అంతేకాదు, ఈ రిక్రూట్మెంట్‌లో ఎంపికైన అభ్యర్థి నాలుగేళ్లపాటు వివాహం చేసుకోకూడదు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా పది పాసై ఉండాలి. 2024 జనవరి 2 నుండి 2 జూలై 2007 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
కావాల్సిన పత్రాలు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ కింది పత్రాలను కలిగి ఉండాలి. SSC మార్క్ షీట్ ,సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటో , 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు కచ్చితంగా తల్లిదండ్రులు సంతకం చేసిన అఫిడవిట్ కలిగి ఉండాలి. 18 కి పైబడిన వారు స్వీయ సంతకంతో అఫిడవిట్ ఇవ్వాలి.
దరఖాస్తు విధానం.. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని వివరాలను నమోదు చేయాలి.. అప్లికేషన్‌తోపాటు కావాల్సిన పత్రాలను ఫోటో కాపీలను జత చేయండి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న చిరునామాకు ఫారమ్‌ను పంపండి.