India Longest Highway: ఇండియాలో రోడ్ వ్యవస్థ చాలా పెద్దది. కొన్ని రహదార్లు చిన్నవిగా కొన్ని పెద్దవిగా ఉన్నాయి. దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి గురించి తెలుసుకుందాం. ఈ రహదారిపై గూగుల్ మ్యాప్ లేకుండానే కశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేరుకోవచ్చు.
ప్రకృతి రమణీయ దృశ్యాలు దేశంలోని అతి పొడవైన హైవేపై జర్మీ అత్యంత సాహసోపేతంగా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మంచు కొండలు, గడ్డి మైదానాలు, మైదాన ప్రాంతాలు, కొండలు, నదీ నదాలు, సముద్రాలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోడ్డు మార్గంలోనే మద్యప్రదేశ్‌లోని కన్హా నేషనల్ పార్క్ జంతువులు రోడ్డు దాటేందుకు 750 మీటర్ల అండర్ పాస్ నిర్మాణం జరిగింది.
నేషనల్ హైవే 44 నార్త్ ఈస్ట్ నుంచి దక్షిణం వరకూ వ్యాపించింది. చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ బోర్డర్ కలిగి ఉంది. దాంతో పాకిస్తాన్ ఈ హైవేపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది.
అతి తక్కువ కర్ణాటకలో నేషనల్ హైవే 44లో తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలది చెరో 504 కిలోమీటర్లు. జమ్ము కశ్మీర్లో 304 కిలోమీటర్లు కాగా ఏపీలో 250 కిలోమీటర్ల పొడవుంది. ఇక పంజాబ్‌లో 278, మహారాష్ట్రలో 232, యూపీలో 189, హర్యానాలో 184 కిలోమీటర్లు కాగా కర్ణాటకలో అత్యంత తక్కువగా 150 కిలోమీటర్లు ఉంది.
తమిళనాడులో 627 కిలోమీటర్ల పొడవు ఈ హైవే మార్గంలో జమ్ము కశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ, ఎంపీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులు కలుస్తాయి. ఈ హైవేపై అత్యధిక భాగం తమిళనాడులో వస్తుంది. ఏకంగా 627 కిలోమీటర్లు తమిళనాడులోనే ఉంటుంది.
7 హైవేలతో నిర్మాణం ఎన్‌హెచ్ 44 అనేది కొత్త రహదారి కానే కాదు. ఇప్పటికే ఉన్న 7 జాతీయ రహదారుల్ని ఏకీకృతం చేసి సిద్ధం చేశారు. ఈ రహదారి ద్వారా రోజూ లక్షలాదిమంది ప్రయాణిస్తుంటారు.
దేశంలోనే పొడవైన నేషనల్ హైవే నెంబర్ 44 దేశంలోకెల్లా అతి పొడవైన జాతీయ రహదారి నెంబర్ 44. ఈ రహదారి పొడవు 3745 కిలోమీటర్లు. ఉత్తరాదిన కశ్మీర్‌ను దక్షిణాదిన కన్యాకుమారితో కలుపుతుంది. 11 రాష్ట్రాలు 30 నగరాలను దాటుకుంటూ వెళ్తుంది.
ప్రపంచంలో 22వ స్థానం దేశంలో అతి పెద్ద హైవే నెంబర్ 44 ప్రపంచంలో 22వ స్థానంలో ఉంది.