Janhvi Kapoor: కుర్రవాళ్ళ హృదయాలను మైమరిపిస్తున్న జాన్వి కపూర్

Janhvi Kapoor Movies : దేవరా సినిమాతో తెలుగుపేక్షకులకు పరిచయమైన హీరోయిన్ జాన్వి కపూర్. అయితే ఈ సినిమా విడుదల కాకముందు నుంచే ఈమెకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఎందుకు ముఖ్య కారణం తెలుగువారు ఎంతగానో అభినందించి శ్రీదేవి కూతురు.. జాన్వికపూర్ కావడం. కాగా సినిమా విషయాలు పక్కన పడితే ప్రస్తుతం తన ఫ్యాషన్ షో ద్వారా ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది జాన్వి కపూర్.

1 /5

శ్రీదేవి, బోనీ కపూర్ కూతురు జాన్వి కపూర్ ముందుగా హిందీ సినిమాలలో ఎంట్రీ.. ఇచ్చి తన టాలెంట్ రుజువు చేసుకుంది. అక్కడ దాదాపు తనకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలలోనే కనిపించింది ఈ హీరోయిన్. అయితే జాన్వికి అనుకున్న స్థాయిలో విజయాలు మాత్రం రాలేకపోయాయి.   

2 /5

ఈ క్రమంలో ఈ మధ్యనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అది కూడా ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి జంట తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎంతటి స్నానం సంపాదించుకుందో అందరికీ తెలిసిన విషయమే.

3 /5

ఇక ఇన్ని సంవత్సరాల తరువాత సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్.. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్.. తెలుగు సినిమాల్లో కలిసి కనిపించనున్నారు అని తెలియగానే.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపించారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మంచి విజయం కూడా సాధించింది.   

4 /5

అయితే ఈ సినిమాలో జాన్వి కపూర్ రోల్.. ఎక్కువ లేకపోవడంతో.. ప్రేక్షకులకు కొంత నిరాశ ఎదురయింది. అయితే రెండో భాగంలో జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ఎక్కువగానే ఉంటుందని దర్శకుడు చెప్పడంతో.. రెండో భాగం కోసం తెగ ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.   

5 /5

ఇక త్వరలోనే రామ్ చరణ్ సినిమాలో కూడా కనిపించనుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో జాన్వి కపూర్ బింకు డ్రస్సులో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులను ఆక ట్టుకుంటున్నాయి.