jayalalitha death anniversary: thalaivi movie stills: తమిళనాడు (Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత (jayalalitha) 4వ వర్ధంతి సందర్భంగా ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి మూవీ స్టిల్స్ (thalaivi movie stills) ను శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు జయలలిత వర్ధంతి (jayalalitha death anniversary) సందర్భంగా అభిమానులు ఆమెకు ఘన నివాళులర్పిస్తున్నారు.
మొదటి నటిగా తన కేరిర్‌ను ప్రారంభించిన జయలలిత.. ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించి చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి ఆ రాష్ట్ర ప్రజలకు అమ్మగా పేరు ప్రఖ్యతలు గడించారు. అనారోగ్య కారణాలతో జయలలిత 2016 సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 75రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన జయలలిత డిసెంబర్ 5న రాత్రి తుదిశ్వాస విడిచారు.
జయలలిత జీవిత కథ ఆధారంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దర్శకుడు ఏఎల్ విజయ్ తలైవి (thalaivi movie ) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ( Kangana Ranaut ) లీడ్ రోల్ పోషిస్తుండగా.. అరవిందస్వామి, ప్రకాష్ రాజ్, భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్ Also read: Rashmika Mandanna: కాటుక కళ్లతో కవ్విస్తున్న రష్మిక..