Kakinada 3 Killed: పండుగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. కాకినాడలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఏపీ ఉలిక్కిపడింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కాకినాడలోని చిన్న పేట గ్రామంలో దీపావళి పండుగరోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇరుకుటుంబాల నడుమ గొడవ ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం ఇరు కుటుంబాల మధ్య ఉన్న చిన్న తగాదా కాస్త కత్తుల దూసుకునే వరకు తీసుకువచ్చింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు వదిలారు.
ఓ మహిళ విషయంలో ఈ హత్యలు జరిగాయని తెలుస్తోంది. ఈ ఘటనలో బత్తుల చిన్ని, బత్తుల రమేష్, బత్తు రాజు అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే తీవ్ర గాయాలై ప్రాణాలొదిలారు.
కుటుంబ సభ్యుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, ఈ హత్యలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఊళ్లో పరిస్థితులు అదుపులో ఉంచేందుకు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
ఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ దర్యాప్తు వేగవంతం చేయిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై దాడికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ దాడి జరిగే సమయంలో కరెంటు కూడా ఆ ప్రాంతంలో లేకపోవడం గమనార్హం.. దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పరారైపోయారు.