Samantha Marriage: రెండో పెళ్లికి సమంత సిద్ధం.. ప్రముఖ దర్శకుడితో మూడుముళ్లు?

Samantha Ready To Second Marriage She Dating With Raj Nidimoru: విడాకుల తర్వాత సినీ నటి సమంత సినిమాలకు కొంత దూరమయ్యారు. అయితే తన మాజీ భర్త నాగచైతన్య రెండో వివాహం చేసుకున్న నేపథ్యంలో సమంత కూడా చేసుకుంటారని చర్చ జరుగుతోంది. ఓ తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుంటారనే వార్త చక్కర్లు కొడుతోంది. తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో వార్త హల్‌చల్‌ చేస్తోంది.

1 /9

చేదు అనుభవం: చేదు అనుభవాలతో సినీ నటి సమంత జీవితం కొనసాగిస్తున్నది. బంధాలతోపాటు ఆరోగ్యం సహకరించక ఇబ్బందులు పడుతున్న ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

2 /9

కీలక నిర్ణయం: దాదాపుగా సినిమాలకు దూరమైన సమంత వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

3 /9

నాగ చైతన్య పెళ్లి: తనతో విడాకులు పొందిన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య శోభిత ధూలిపాళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి సమంత తాను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

4 /9

బాలీవుడ్‌ హీరోతో డేటింగ్‌: ఇప్పటికే ఓ బాలీవుడ్‌ నటుడితో డేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. తర్వాత అది అబద్ధమని తేలింది.

5 /9

మరొకరితో ప్రేమాయణం: తాజాగా మరొకరితో సమంత ప్రేమాయణం సాగిస్తోందని చర్చ నడుస్తోంది. ఓ సినిమాతో అతడితో అయిన పరిచయం ప్రేమగా మారిందనే వార్తలు సంచలనంగా మారాయి.

6 /9

సిటడెల్‌ దర్శకుడు: అయితే సమంత ప్రేమలో ఉన్నది సిటడెల్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో అనే వార్త వైరల్‌గా మారింది.

7 /9

రెండుసార్లు అవకాశం: ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌లో దర్శకుడు రాజ్‌తో సమంతకు పరిచయమైంది. ఆ పరిచయమే సిటడెల్‌లో కూడా సమంతకు అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

8 /9

షూటింగ్‌లో లవ్‌: సిటడెల్‌ షూటింగ్‌ సమయంలో సమంత, రాజ్‌కు మధ్య పరిచయం పెరిగిందని.. అది కాస్త ప్రేమకు దారి తీసిందని టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు వస్తున్నాయి. కానీ వీరి బంధంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

9 /9

తాను రెండో వివాహం చేసుకోనని ప్రకటించిన సమంత తాజాగా రాజ్‌తో డేటింగ్‌ ఉన్నట్లు వార్తలు రావడంతో సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. నిజాలేంటో ఇంకా బయటకు రాలేదు.