Keerthy suresh mangalsutra: మహానటి కీర్తిసురేష్ ఇంకా తన మెడలో పసుపు తాడే ఉండటంతో ఇండస్ట్రీలో ఈ విషయంలపై పెద్ద చర్చ నడిచినట్లు తెలుస్తొంది. తాజాగా.. కీర్తిసురేష్ దీని వెనుకాల ఉన్న అసలు విషయాన్ని బైటపెట్టినట్లు తెలుస్తొంది.
కీర్తిసురేష్ ఇటీవల తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్నారు. గోవాలో వీరి పెళ్లివేడుక గ్రాండ్ గా డిసెంబరు 12న జరిగింది. దాదాపు.. వీరి మధ్య ప్రేమ 15 ఏళ్లు నడిచిందంట.
పెళ్లి అయిన తర్వాత కూడా కీర్తిసురేష్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా రెండు రోజుల్లోనే బేబీజాన్ మూవీ ప్రమోషన్ ప్రొగ్రామ్స్ లలో పాల్గొన్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా.. దీనిలో ఆమె మెయిన్ గా పసుపు తాడు మంగళ సూత్రం ధరించి తెగ రచ్చ రచ్చ చేశారు. ఇప్పటికి కూడా ఎక్కడకు వెళ్లిన కూడా పసుపు తాడుతోనే కన్పిస్తున్నారు.
దీనిపైన పెద్ద రచ్చ నడిచినట్లు తెలుస్తొంది. తాజాగా.. కీర్తిసురేష్ ఒక ఇంటర్వ్యూలో దీనిపైన మాట్లాడారంట. పసుపు మంగళసూత్రాన్ని ఎంతో శక్తివంతమైనదిగా, పవిత్రమైందని చెప్పుకొచ్చారు.
అయితే.. పెళ్లి తర్వాత కొన్ని రోజుల్లో మంచి రోజులుంటే.. అప్పుడు చాలా మంది పసుపు తాడు నుంచి గోల్డ్ మంగళసూత్రంను ధరిస్తారు. కానీ తమ పెళ్లి తర్వాత కొన్నిరోజులు అంతగా బాగా లేవని ఆమె అన్నారంట.
ప్రస్తుతం జనవరిలో ఒక తమకు అనుకూలమైన రోజు ఉందని .. అప్పుడు పసుపు తాడు మంగళసూత్రం నుంచి గోల్డ్ మంగళ సూత్రంను ధరించనున్నట్లు కీర్తిసురేష్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది.