Kitchen Vastu Tips: ఇంటి వంటగదిని హిందూ ధర్మం ప్రకారం అర్ణపూర్ణదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. అందుకే కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని కూడా మన పెద్దలు చెబుతుంటారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతారు. అందులో ఇంటి వంటగది కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఆర్థిక బాధలు, తరచూ గొడవలు జరుగుతుంటే వెంటనే ఈ రెమిడీ ట్రై చేయండి. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేస్తారు. దిశను అనుసరించి గదులు కూడా కడతారు. అయితే, ఇంటి వంట గది ఆగ్నేయ దిశలో నిర్మించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. లేకపోతే ఆ ఇంట్లో మనస్పర్థలు మొదలవుతాయి.
అంతేకాదు ఆగ్నేయ దిశలో కాకుండా వేరే ఈశాన్య దిశలో తెలియక కొంతమంది ఏర్పాటు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతాయి. కుటుంబంలో సఖ్యత కోల్పోతారు.
వాస్తు ప్రకారం ఇంటి వంట గది ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకోవడంతోపాటు తూర్పు దిశగా తిరిగి వంట చేయాలి. ఇదే సరైన వాస్తు నియమం. అంతేకాదు ఇంట్లో రాత్రి గిన్నెలు సింక్‌లో అలాగే వదిలేస్తారు. అలా చేయకుండా రాత్రే వాటిని శుభ్రం చేసుకోవాలి.
ఇంటి వంట గ్యాస్ పక్కనే సింక్ ఇతర నీటి సంబంధిత వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అగ్ని, నీరు పక్కపక్కనే ఉండకూడదని వాస్తు శాస్త్రంలో చెబుతారు. అంతేకాదు కిచెన్‌లో కొంతమంది చీపురు, డస్ట్‌బిన్‌లు కూడా పెడతారు ఇలా చేయకూడదు.
అయితే, ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే ఇంటి వంటగదిలో నల్లనువ్వులు లేదా నల్లమిరియాలను ఒక మూట కట్టి పెట్టాలని అంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అగరబత్తిలు వంటివి వెలిగించాలి. ఆగ్నేయ మూలలో దీపం పెట్టాలని పెద్దవారు సూచిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎంతటి అప్పుల బాధలు ఉన్న వెంటనే బయటపడతారు
వాస్తు ప్రకారం ఇంటి వంటగదిలో ఉప్పు, బియ్యం, పసుపు, పప్పులు ఎప్పుడూ నిండుకోకుండా జాగ్రత్త పడాలి. వంటగదిలో స్టవ్‌తోపాటు ప్లాట్‌ఫారమ్ ఎప్పుడూ మంగళవారం, శుక్రవారాల్లో శుభ్రం చేయకూడదు. ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుందని నమ్ముతారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)