Best Road Trips: టూరింగ్ అంటే మనలో చాలామందికి ఇష్టముంటుంది. కొత్త ప్రాంతాలు చూడటం, కొత్త వ్యక్తులతో పరిచయాలు మంచి అనుభవాన్నిస్తాయి. రోడ్ ట్రిప్స్ ఇందులో అనిర్వచనీయమైన అనుభూతిని కల్గిస్తాయి. రోడ్ ట్రిప్స్ అయితే మీకిష్టమొచ్చినట్టుగా ప్రయాణం చేస్తూ కావల్సిన, నచ్చిన చోట ఆగుతూ వెళ్లవచ్చు. ఇండియాలోని టాప్ 5 రోడ్ ట్రిప్స్ ఏమున్నాయో చూద్దాం...
ముంబయి-గోవా రోడ్ ఒకవేళ సముద్రతీరం, సూర్యుని అణ్వేషణ కోరుకుంటే ముంబై నుంచి గోవా రోడ్ ట్రిప్ అద్భుతమైంది. ఈ రోడ్ ట్రిప్ ద్వారా అందమైన సముద్రతీరం ప్రశాంతతను మిగుల్చుతుంది. గోవా నైట్ లైఫ్ మరింత చక్కని అనుభూతిని ఇస్తుంది.
జైపూర్-జైసల్మేర్ రోడ్ జైపూర్ నుంచి జైసల్మేర్ వెళ్లే రోడ్ ట్రిప్ అందమైన రాజస్థాన్ ఎడారి ప్రాంతాన్ని పరిచయం చేస్తుంది. ఇసుక తిన్నెలపైనుంచి ఒంటెపై ప్రయాణం ఆస్వాదించవచ్చు. రాజసం ఒలికించే కోటలు, మహల్స్ చూడవచ్చు. సాంప్రదాయ, సాంస్కృతిక కళల్ని ఆస్వాదించవచ్చు. జైసల్మేర్ కోట, ధార్ ఎడారి ఇలా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.
గౌహతి-తవాంగ్ రోడ్ గౌహతి నుంచి తవాంగ్ వెళ్లే రోడ్ ట్రిప్ ఈశాన్య భారతదేశపు అందాల్ని పరిచయం చేస్తుంది. సుందరమైన కొండలు, ప్రశాంతమైన బౌద్ధ మఠాలు, స్థానిక తెగలు ఇలా ప్రతి ఒక్క అంశానికి విశిష్ట ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంటాయి.
ఢిల్లీ - లేహ్ రోడ్ ఢిల్లీ నుంచి లేహ్ వెళ్లే రోడ్డు అద్భుతమైన అనుభవాన్నిస్తుంది. మంచుతో కప్పబడి ఉండే కొండలు, అందమైన లోయలు, ప్రశాంతమైన సరస్సులు, ముగ్ద మనోహర దృశ్యాలు మీ ప్రయాణాన్ని మరపురానిదిగా మార్చుతుంది. రోహ్తంగ్ దర్గా లేదా అటల్ టన్నెల్, పెంగోంగ్ సరస్సులు ఇందులో అద్భుతమైనవి.
చండీగఢ్-కసోల్ రోడ్ హిమాలయాల్లో ఉన్న కసోల్ ప్రకృతి ప్రేమికులకు, సాహసికులకు స్వర్గం లాంటిది. చండీగఢ్ నుంచి కసోల్ రోడ్ ట్రిప్‌లో సుందరమైన కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, మెరిసే నదీ ప్రవాహాలు ఇలా ప్రతి ఒక్కటి మీకు చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి. కసోల్‌లో ట్రాకింగ్ , రివర్ రాప్టింగ్, క్యాంపింగ్ కూడా చేయవచ్చు.