Longest Train Journey: 13 దేశాలు..21 రోజులు.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణానికి ఎంత ఛార్జీ చెల్లించాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

World's Longest Train Journey: రైలు ప్రయాణం అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా రైలులో విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ ప్రత్యేక రైలు తప్పకుండా నచ్చుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి మీకు తెలుసా. 13దేశాలు, 21 రోజుల పాటు ప్రయాణించే రైలు ప్రయాణానికి ఎంత ఛార్జీ చెల్లించాలో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 
 

1 /7

World's Longest Train Journey:  దేశంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కొత్త జంటలు తమ హనీమూన్ కోసం ప్లాన్ చేస్తుంటారు. కొందరు సిమ్లా, మనాలి వెళ్లాలి అనుకుంటే మరికొంతమంది సింగపూర్, ప్యారిస్ లో ప్లాన్ చేస్తుంటారు. చాలా మంది తమ బడ్జెట్ కు అనుగుణంగా హనీమూన్ కు ప్లాన్ చేసుకుంటారు. అయితే మీరు  ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రైలు సింగపూర్, ప్యారిస్, స్పెయిన్ అందాలతోపాటు థాయిలాండ్ మధ్యలో ప్రయాణిస్తుంది. ఈ దేశాలే కాదు ప్రపంచంలోని 13దేశాల్లో ప్రయాణించే రైలు..దాని ఛార్జీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 /7

మిర్రర్ నివేదిక ప్రకారం, పోర్చుగల్ నుండి సింగపూర్ వరకు నడుస్తున్న రైలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం ఇది. మార్గంలో, ఈ రైలు 13 దేశాలను కవర్ చేస్తూ దాని గమ్యాన్ని చేరుకుంటుంది.   

3 /7

ఈ రైలు తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి 21 రోజులు పడుతుంది. అంటే ఒక్కసారి టికెట్ కొని రైలు ఎక్కితే 21 రోజుల పాటు వివిధ దేశాలను ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ప్రయాణంలో రైలు 11 చోట్ల ఆగుతుంది. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయాణ సమయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.   

4 /7

18,755 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు పోర్చుగల్‌లోని అల్గెర్నీ నుండి బయలుదేరి స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, వియత్నాం, థాయ్‌లాండ్ మీదుగా సింగపూర్ చేరుకుంటుంది. దారిలో పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ వంటి నగరాల గుండా వెళుతుంది. ఇది మిమ్మల్ని యూరప్‌లోని అందమైన దేశాలకు తీసుకెళ్తుండగా, సైబీరియాలోని చల్లని ప్రాంతాల ఆనందాన్ని కూడా ఇస్తుంది.    

5 /7

ఈ రైలు 21 రోజులు పాటు ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేక రైలు ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయనుకుంటారు. కానీ మీరు అనుకున్నది పొరపటే. ఈ రైలు ఛార్జీ 1350 US డాలర్లు మాత్రమే. మనం దీనిని భారతీయ రూపాయిలలో చూస్తే, అది సుమారు రూ. 1,13,988.98, అంటే మీరు యూరప్ నుండి ఆసియాకు కేవలం లక్ష రూపాయలలో ప్రయాణిస్తారు.   

6 /7

ఈ రైలులో, టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆహారం, పానీయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆహారం, వసతి కోసం అన్ని ఏర్పాట్లు రైలులోనే ఉంటాయి. బోటెన్-వియంటియాన్ రైలు మార్గాన్ని ప్రారంభించడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం ప్రారంభం అయింది.   

7 /7

మీరు ఈ రైలులో ప్రయాణించాలనుకుంటే, ప్రయాణించే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మీ ప్రయాణాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, అవసరమైన పత్రాలు, సీట్ల ఎంపిక, రెండు రైళ్ల మధ్య కనెక్షన్ మొదలైనవాటిని చెక్ చేసుకుని టికెట్ బుక్ చేసుకోవాలి.