New Rules in December: రేపటి నుంచి డిసెంబర్ నెల ఆరంభంకానుంది. ఈ ఏడాదికి చివరి నెల కావడంతో ఆర్థిక అంశాలపై ప్రభావం చూపే నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. గ్యాస్ ధరలు, క్రెడిట్ కార్డు రూల్స్, బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి..? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా దేశీయ, వాణిజ్య గ్యాస్ రేట్లలో మార్పులు జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
డిసెంబర్ 1 నుంచి SBI క్రెడిట్ కార్డు కొత్త రూల్స్ అమలుకానున్నాయి. ఇకపై డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను పొందలేరు.
డిసెంబర్ నెలలో బ్యాంకులకు 17 రోజుల సెలవులు రానున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల పండుగలను బట్టి సెలవులు ఉంటాయి.
ఆసుపత్రులు, బీమా సంస్థలు ఖర్చు అంచనాల కోసం ప్రామాణిక టెంప్లేట్లను ప్రవేశపెట్టనున్నాయి. పేషంట్స్ హెల్త్ కేర్ ఖర్చులు మరింత పారదర్శకంగా ఉండేలా నిబంధనలు అమలు చేయనున్నారు.
డిసెంబర్ 1వ తేదీ నుంచి మాల్దీవులకు ఫ్లైట్ ఛార్జీలు పెరగనున్నాయి. ఎకానమీ-క్లాస్ ఫీజులు రూ.2,532 నుంచి రూ.4,220, బిజినెస్ క్లాస్ రూ.5,064 నుంచి రూ.10,129, ఫస్ట్ క్లాస్ రూ.7,502, ప్రైవేట్ జెట్ రూ.10,129 నుంచి రూ.40,515 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ట్రాయ్ కొత్త ట్రేసబిలిటీ రూల్స్ డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. కొత్త రూల్స్‌తో స్కామ్‌లకు అడ్డుకట్ట వేయడంతోపాటు డిజిటల్ కమ్యూనికేషన్ మరింత పటిష్టం కానుంది. ను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.