Cyclone Fengal: బిగ్ అలర్ట్.. ఫెంగల్ తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు..!

Heavy Rains in AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. ఈ తుపానుకు 'ఫెంగల్'గా నామకరణం చేశారు. ఉత్తర-వాయువ్య దిశగా పయనించనుందని.. ప్రస్తుతానికి  పుదుచ్చేరికి 230 కి.మీ, చెన్నైకి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదులుతోందని తెలిపారు. దీని ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలకు కురుస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /7

దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  

2 /7

ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.  

3 /7

నేడు మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉందన్నారు.  

4 /7

తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి 70-90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు.  

5 /7

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.  

6 /7

మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబరు హెచ్చరిక జారీ చేయగా.. మిగిలిన పోర్టులకు రెండో నంబరు హెచ్చరిక జారీ చేశారు.   

7 /7

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడులోని ఏడు జిల్లాలకు అధికారులు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. వదర ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు.