Celebrities in Drugs case: డ్రగ్స్ కేసులో మాలీవుడ్ స్టార్స్.. తెరపైకి మరో షాకింగ్ ఘటన..!

Drugs case : ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో డ్రగ్స్ కేస్ కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ మధ్యనే మంజుమల్ బాయ్స్ తో సూపర్ హిట్ సంపాదించుకున్న ఒక నదులు సైతం ఈ డ్రగ్స్ కేస్ లో చిక్కుకున్నారు. ఇక ఈయనతో పాటు ఒక హీరోయిన్ కూడా ఈ కేసులో ఉండడం గమనర్హం. పూర్తి వివరాలు మీకోసం..

1 /5

ఒకవైపు మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఆరోపణల వినిపిస్తూ ఉండగా.. మరొకవైపు డ్రగ్స్ వ్యవహారం కూడా సంచలనంగా మారింది. ప్రముఖ గ్యాంగ్ స్టర్ ఓం ప్రకాష్ నిర్వహిస్తున్న డీజే పార్టీలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులకు పక్కా ఆధారాలు లభించడంతో అక్కడ సోదాలు నిర్వహించారు.  ఇప్పటికే అతనిపై దాదాపు 30 క్రిమినల్ కేసులు కూడా నమోదు అయినట్లు సమాచారం. 

2 /5

అయితే ఈ గ్యాంగ్ స్టార్ ఓం ప్రకాష్ తో ప్రముఖ నటీనటులు శ్రీనాథ్ భాసి,  ప్రయాగ మార్టిన్ లకు సంబంధం ఉందని తెలియడంతో మలయాళ చిత్ర పరిశ్రమలో  ఈ విషయం కాస్త సంచలనం సృష్టిస్తోంది.  ఒక హోటల్లో ప్రకాష్ ను అరెస్టు చేసిన తర్వాత అతడిని రిమాండ్ కు తరలించారు.ఈ నేపథ్యంలోనే రిమాండ్ రిపోర్టులో అతడు ఈ ఇద్దరి పేర్లను చెప్పినట్లు సమాచారం . ఇకపోతే ఓం ప్రకాష్ అతడి స్నేహితుడు షియాస్ గదుల నుంచి కూడా డ్రగ్స్ స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. 

3 /5

అయితే మాదకద్రవ్యాల వినియోగంపై పోలీసులు చేసిన ఆరోపణలను పోలీసులు రుజువు చేయకపోవడంతో ప్రకాష్ మరియు షియాస్ ఇద్దరికీ కూడా సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. వీరిద్దరూ ఉపయోగించిన గదుల దాదాపు 20 మంది ఉన్నారని,  ఆ జాబితాలో ఈ ఇద్దరి నటుల పేర్లు కూడా ఉన్నాయని రిమోట్ రిపోర్టులో తెలిపారు. 

4 /5

యాదృచ్ఛికంగా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీపై విచారణ జరిపిన హేమా కమిటీ నివేదికలో కూడా డ్రగ్స్ విపరీతమైన వినియోగం గురించి ప్రస్తావించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ప్రస్తుతం ప్రయాగ మరియు శ్రీనాథ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

5 /5

 ప్రయాగ విషయానికి వస్తే 2009లో తన 29 సంవత్సరాల ప్రాయంలో సినీ జీవితాన్ని ప్రారంభించింది.  ఇప్పటికి దాదాపు 12కు పైగా చిత్రాలలో నటించింది. సినీ పరిశ్రమలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.  మరొకవైపు శ్రీనాథ్ (36) కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు.  ఇలా వీరిద్దరు కూడా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఈ విషయం సంచలనంగా మారింది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x