Money for Marriage: సాధారణంగా పెళ్లి జరిగినప్పుడు రెండు కుటుంబాల మధ్య నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. ఇది వరకట్నం కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు మరే ఇతర రూపమైనా కావచ్చు ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం అది. అయితే ఓ దేశంలో పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఆ దంపతులకు 20-30 మిలియన్ల నగదు అందిస్తుంది. నమ్మలేకపోతున్నారా...
ఎవరు అప్లై చేయాలి ఈ ప్రోగ్రాంలో భాగమయ్యేందుకు వయస్సు 24-43 ఏళ్లు ఉండవచ్చు. సాహా జిల్లా వాసులై ఉండి ఇక్కడే ఉద్యోగం చేసేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ముందుగా ఓ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ తరువాత స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ప్రక్రియ ఉంటుంది
పెళ్లి చేసుకుంటే 20 మిలియన్లు ఈ ప్రోగ్రామం ద్వారా డేటింగ్‌కు అంగీకరిస్తే ఒక కపుల్‌కు 360 డాలర్లు ఇస్తారు. అదే కపుల్ పెళ్లి చేసుకుని కుటుంబం ఏర్పర్చుకునేందుకు సిద్ధమైతే వెడ్డింగ్ గిఫ్ట్ కింద 20 మిలియన్లు అందిస్తారు
అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ ఇదొక పైలట్ ప్రాజెక్ట్. ఇందులో భాగంగా దక్షిణ కొరియాలోని రెండవ పెద్ద నగరం సాహా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బడ్జెట్ రూపొందించింది. అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది
ఈ దేశంలో మ్యాచ్ మేకింగ్ ప్రోగ్రామ్ దక్షిణ కొరియా ప్రభుత్వం మ్యాచ్ మేకింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఒంటరిగా ఉండే పురుషులు లేదా మహిళలను పెళ్ళి చేసుకుని కుటుంబం ఏర్పర్చుకునేందుకు సిద్ధం చేయడం. ఎందుకంటే ఈ దేశంలో బర్త్ రేట్ చాలా తక్కువగా ఉంటోంది.