Navaratri: సంచలన నిర్ణయం.. నవ రాత్రులు 9 రోజులపాటు చికెన్‌, మటన్‌ విక్రయాలు బంద్‌..!

Meat Banned During Navaratri: నవ రాత్రుల సందర్భంగా చికెన్‌, మటన్‌ విక్రయాలు బ్యాన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు అక్టోబర్‌ 3 నుంచి నవ రాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 11 తో ముగుస్తాయి. ఈ సందర్భంగా మాంసం విక్రయించకూడదని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
 

1 /5

Meat Banned During Navaratri: రేపటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చికెన్‌, మటన్‌ విక్రయాలు బ్యాన్‌ చేసింది యూపీ ప్రభుత్వం. అక్టోబర్‌ 3 నుంచి 12 తేదీ వరకు ఈ విక్రయాలను బ్యాన్‌ చేసింది యోగీ ప్రభుత్వం.  

2 /5

మార్కండేయ పురాణం ప్రకారం ఈ నవరాత్రులు 9 అవతారాలను పూజిస్తారు. దుర్గా మాతను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ సమయంలో కొంతమంది భక్తులు ఉపవాసాలు కూడా పాటిస్తారు. మహర్నవమి రోజు హవనం నిర్వహిస్తారు. దసరాతో ఈ ఉపవాసం విరమిస్తారు.  

3 /5

మహర్నవవి రోజు కలశ స్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో మాంసం విక్రయాలు అయోధ్యలో 9 రోజులపాటు బ్యాన్‌ చేస్తున్నట్లు సీఎం యోగీ ఆధిత్యనాథ్‌ నిషేధించారు. కొన్నిరిపోర్టుల ప్రకారం అక్టోబర్‌ 3 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు.   

4 /5

ఈ సందర్భంగా అయోధ్య డిస్ట్రిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ మాంసం సంబంధించిన ఉత్పత్తులు ఈ తొమ్మిది రోజులపాటు బ్యాన్‌ చేశారు. అయోధ్యలోని ఫుడ్‌ సేఫ్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆదేశాలను జారీ చేశారు. ఇది నాన్‌ వెజ్‌ విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా వర్తిస్తాయి.  

5 /5

అన్ని హోటళ్లకు కూడా ఈ ఆదేశాలను జారీ చేశారు. ఏవరైనా ఈ విక్రయాలు జరిపితే 0527-8366607 కాల్‌ చేయాలని కోరారు. అయోధ్య రామమందిరంలో బాలరాముడి కొలువై ఉన్నాడు. అయితే, ఆల్కహాల్‌కు సంబంధించిన అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.