Minister Roja: బ్యాట్ పట్టిన మంత్రి రోజా.. అచ్చం క్రికెటర్‌లానే..

Jagananna Sports Celebrations: చిత్తూరు జిల్లా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జిల్లా జగనన్న క్రీడా సంబరాలను మంత్రి రోజా ప్రారంభించారు. చిత్తూరు జిల్లా నుంచి కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
 

  • Nov 28, 2022, 17:57 PM IST
1 /5

ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి మంత్రి రోజా సరదాగా ఆటలు ఆడారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.  

2 /5

బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన రోజా.. క్రీడాకారుల్లో ఫుల్ జోష్ నింపారు.

3 /5

క్రికెట్‌తో పాటు కబడ్డీ, వాలీబాల్ కూడా ఆడి ఆటగాళ్లను ఆమె ఉత్సాహపరిచారు.  

4 /5

క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటలు ఆడేవిధంగా ప్రోత్సహించాలని ఆమె సూచించారు.   

5 /5

ఈ కార్యక్రమంలో మంత్రి రోజాతో పాటు ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు జేసీ వెంకటేశ్వర్, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.