Israel Hamas War: ఇజ్రాయిల్‌-హ‌మాస్ యుద్ధంలో 46వేల మందిపైగా మృతి.. విధ్వంసమైన గాజా ఫొటోలు చూడండి.

Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ నిరంతరం హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటోంది. యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 46,000 దాటింది.
 

1 /7

15 నెలల సుదీర్ఘ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య గురించి గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారాన్నిషేర్  చేసింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 46,006 మంది పాలస్తీనియన్లు మరణించారని, 109,378 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

2 /7

మృతుల్లో సగానికిపైగా మహిళలు, పిల్లలు ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చనిపోయిన వారిలో ఎంతమంది యోధులు లేదా పౌరులు ఉన్నారో మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు.  

3 /7

17,000 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండానే చెప్పింది. గాజాలో ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతున్నాయి.  

4 /7

గత సంవత్సరం కూడా, గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరణించిన, గాయపడిన వారి గణాంకాలను పంచుకుంది. వేలాది మృతదేహాలు శిథిలాల కింద లేదా వైద్యులు చేరుకోలేని ప్రాంతాల్లో పాతిపెట్టినందున అసలు మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  

5 /7

గాజాలో ప్రజలకు ఆహారం, నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. తీవ్రమైన చలి మధ్య పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్వాసిత శిబిరాల్లో నివసించవలసి వస్తుంది.  

6 /7

అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 1,200 మందిని చంపడంతో ఇజ్రాయెల్ -హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది.  

7 /7

హమాస్ ఉగ్రవాదులు 250 మందిని కిడ్నాప్ చేశారు, వారిలో 100 మంది ఇప్పటికీ గాజాలో బందీలుగా ఉన్నారు. ఈ బందీలలో కనీసం మూడింట ఒకవంతు చనిపోయారని అనుకుంటున్నారు.