Sun Never Sets: రవి అస్తమించని దేశాలేంటో తెలుసా, ఈ దేశాల్లో అసలు రాత్రే ఉండదు

రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం గురించి తెలుసు. బ్రిటీషు పాలనలో ఉన్న ప్రపంచ దేశాల గురించి ఈ మాట విన్నాం. కానీ ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో సూర్యుడు ఉదయించడంటే నమ్మగలరా..కానీ ఇది నిజం. ప్రపంచంలో 70 పైగా దేశాల్లో సూర్యుడు అసలు అస్తమించడు. కొన్ని దేశాల్లో రవి ఉదయించడు. అలాంటి  దేశాల గురించి తెలుసుకుందాం.

Sun Never Sets: రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం గురించి తెలుసు. బ్రిటీషు పాలనలో ఉన్న ప్రపంచ దేశాల గురించి ఈ మాట విన్నాం. కానీ ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో సూర్యుడు ఉదయించడంటే నమ్మగలరా..కానీ ఇది నిజం. ప్రపంచంలో 70 పైగా దేశాల్లో సూర్యుడు అసలు అస్తమించడు. కొన్ని దేశాల్లో రవి ఉదయించడు. అలాంటి  దేశాల గురించి తెలుసుకుందాం.
 

1 /7

స్వీడన్ మే నెల ప్రారంభం నుంచి ఆగస్టు నెల చివరి వరకూ స్వీడన్‌లో సూర్యుడు అర్ధరాత్రి అస్తమిస్తాడు. తిరిగి ఉదయం 4 గంటలకు ఉదయిస్తాడు. 6 నెలలు సూర్యుడు ఇక్కడ అస్తమించడు.

2 /7

బైరో, ఆలాస్కా మే నెలాఖరు నుంచి జూలై చివరి వరకూ ఈ దేశంలో సూర్యుడు అస్తమించడు. ఆ తరువాత నవంబర్ ప్రారంభం నుంచి నెలరోజుల వరకూ సూర్యుడు ఉదయించడు. దీనినే పోలార్ నైట్ అంటారు. అంటే ఈ దేశంలో చలికాలం అంతా చీకట్లో ఉంటుంది

3 /7

ఐస్‌ల్యాండ్ యూరప్‌లో గ్రేట్ బ్రిటన్ తరువాత అతిపెద్ద ఐస్‌ల్యాండ్. జూన్ నెలలో ఈ దేశంలో సూర్యుడు అస్తమించడు

4 /7

నునావృత్ - కెనడా ఈ ప్రాంతం ఆర్కిటిక్ సర్కిల్ నుంచి 2 డిగ్రీలు ఎగువన కెనడాకు నార్త్ ఈస్ట్‌లో ఉంది. ఈ ప్రాంతంలో రెండు నెలల వరకు 24 గంటలు సూర్యుడు ఉదయించే ఉంటాడు. చలికాలంలో 30 రోజులు చీకటి ఉంటుంది.

5 /7

నార్వే ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉన్న ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ ద మిడ్‌నైట్ అంటారు. ఈ దేశంలో మే నుంచి జూలై వరకూ సూర్యుడు అస్తమించడు. అంటే 76 రోజులపాటు సూర్యుడు కన్పించకుండా ఉండడు. నార్వేలోని స్వాల్‌బర్డ్‌లో సూర్యుడు ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు కన్పిస్తూనే ఉంటాడు. 

6 /7

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని దేశాలు, అస్తమించని దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అసలు సూర్యుడే కన్పించడు. కొన్ని దేశాల్లో అసలు సూర్యుడు కన్పించకుండా ఉండదు

7 /7

ఫిన్‌ల్యాండ్ ఇక్కడ వేలాది ఐల్యాండ్స్ ఉంటాయి. వేసవిలో ఫిన్‌ల్యాండ్‌లో వరుసగా 73 రోజులు సూర్యుడు కన్పిస్తూనే ఉంటాడు. చలికాలంలో సూర్యుడు ఉదయించడు.