Dhanteras 2024: 59 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన యోగం.. ధన త్రయోదశి రోజు అదృష్టం కలిసి వచ్చే 5 రాశులు..!

Dhanteras 2024 Lucky Zodiac Signs: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ రోజుకు ముందుకు వచ్చేది ధన త్రయోదశి ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తారు. అయితే 59 ఏళ్ల తర్వాత ఏర్పడే అరుదైన యోగం ధన త్రయోదశి రోజున జరగబోతుంది. ఈ సమయంలో ఓ ఐదు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.
 

1 /7

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధన త్రయోదశి రోజు ఐదు రాశులకు శుభ ఘడియలు మొదలవుతాయి దీంతో అనేక ప్రయోజనాలు పొందుతారు ముఖ్యంగా ఇది రాజయోగం వంటిది లక్ష్మీదేవికి ప్రత్యేకం ఈరోజు లక్ష్మీ పూజ చేస్తారు.  

2 /7

బృహస్పతి మేష రాశిలో శుక్రుడు కన్య రాశిలో 30 ఏళ్ల తర్వాత శని కుంభరాశిలో ఉన్నాడు ఇది 59 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన యోగం సూర్యుడు తులా రాశిలో ఉంటాడు.ఈ యోగం వల్ల ఐదు రాశుల వరకు వారికి బాగా అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు ఈరోజు రాజయోగం కూడా ఏర్పడుతుంది. దీంతో అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందామా?  

3 /7

మేష రాశి.. ఈ అరుదైన రాజయోగం వల్ల మేష రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ప్రారంభించిన ప్రతి పనిలో విజయం పొందుతారు. ముఖ్యంగా అద్భుతమైన అవకాశాలు వారి సొంతమవుతాయి. ధన త్రయోదశి రోజున మేష రాశి వారికి చాలా శుభప్రదమైన రోజు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.

4 /7

మిథున రాశి వారికి కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. ఉద్యోగులకు మంచి సమయం కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.  

5 /7

ధన త్రయోదశి రోజున ఏర్పడుతున్న ఈ అరుదైన యోగం వల్ల ఈ సింహ రాశి వారు కూడా శుభం, అవివాహితులకు ఈ కాలంలో వివాహ యోగం కలుగుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు.  

6 /7

మకర రాశి వారికి కూడా ధనత్రయోదశి శుభ సమయం. పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఈ సమయంలో మకర రాశి వారికి కుటుంబం మద్దతు లభిస్తుంది  

7 /7

ధన త్రయోదశి రోజు ఏర్పడిన యోగం వల్ల కుంభ రాశి వారికి కూడా వ్యాపారంలో బాగా లాభాలు గడిస్తారు. ముఖ్యంగా ఏ పని మొదలుపెట్టిన పూర్తవుతుంది .ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)