Balakrishna vs Jr NTR: బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఏదో ఉంది అన్న వార్త ఎన్నో రోజుల నుంచి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈమధ్య జరిగిన సంఘటనలు సైతం వాటికి ఆద్యం పోసేలా మారాయి. ఈ క్రమంలో ముఖ్యంగా అన్ స్టాపిబుల్ షోలో ఎన్టీఆర్ పేరు వినపడకపోవడం మరిన్ని విమర్శలకు దారితీసింది.
గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నాయి.. అయితే కొన్ని సందర్భాలలో వీరు చేసేటువంటి కొన్ని పనుల వల్ల కూడా అభిమానులకు నిరుత్సాహాన్ని కలిగించేలా ఉంటాయి. అలా ఇటీవలే మరొకసారి సోషల్ మీడియాలో నందమూరి కుటుంబం లో విభేదాలు వైరల్ గా మారుతున్నాయి. అందుకు కారణం ఇటీవల అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ , డైరెక్టర్ బాబీ అడిగిన ప్రశ్నలలో జూనియర్ ఎన్టీఆర్ పేరుని ప్రస్తావించకపోవడమే ప్రధాన కారణం.
బాలయ్య నటించిన డాకు మహారాజు.. సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య అన్ స్టాపబుల్ షో కి చిత్ర బృందం అటెండ్ అయ్యింది. ఇందులో జరిగిన ఒక సంఘటన సరికొత్త వివాదానికి ఆజ్యం పోసినట్లుగా మారింది. డాకు మహారాజ్ ప్రమోషన్ లో భాగంగా.. డైరెక్టర్ బాబి కొల్లి, నిర్మాత నాగవంశీ ఈ షోలోకి వచ్చారు.
అయితే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వహించిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాలను బాలయ్య ప్రస్తావించారు కానీ డైరెక్టర్ బాబి కెరియర్ లో కీలకమైన జై లవకుశ సినిమా గురించి స్పందించలేదని అభిమానులు ఫైర్ అవుతున్నారు.. ఇది ఎన్టీఆర్ సినిమా కాబట్టి బాలయ్య వీటిని ప్రస్తావించలేదు అనే విధంగా ఎన్టీఆర్ అభిమానులు విమర్శిస్తూ ఉన్నారు.
అంతేకాకుండా ఈ షోలో ఎన్టీఆర్ గురించి మాట్లాడినటువంటి పార్ట్ ని కూడా తీసేసారు అన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.. నిజానికి ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కానీ, జై లవకుశ సినిమా ప్రస్తావన కానీ రాలేదని అలాంటప్పుడు వాటిని కట్ చేయాల్సిన.. అవసరం లేదని వెల్లడించారు. అంతేకాదు బాలకృష్ణ కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని.. ఒకసారి షూటింగ్లో కూడా బాలకృష్ణ ఈ సినిమా తారక్ చేస్తే బాగుంటుందని చెప్పారని నాగ వంశీ అన్నారు.
మరోపక్క బాబీ కూడా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో జై లవకుశ నాకు చాలా ఇష్టం అని బాలయ్య నాతో రెండు మూడు సార్లు అన్నారు అన్న క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని కూడా చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నా.. మరి బాలయ్య అన్ స్టాఫబుల్ షోలో లో ఎందుకు ఎన్టీఆర్ గురించి ప్రస్తావించలేదు అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఇప్పటికి కూడా నిర్మాత, దర్శకుడు క్లారిటీ ఇచ్చారు కానీ.. బాలకృష్ణ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తడం లేదు అని అంటున్నారు. మరి దీనిపై పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.