Gray Hair Remedy: జుట్టు తెల్లబడినప్పుడు వయస్సులో ఉన్నా అందవిహీనంగా కనిపిస్తారు. అయితే, జుట్టును నల్లగా మార్చుకోవడానికి హెన్నా ఉపయోగిస్తాం. కానీ, దీని కంటే ఎఫెక్టీవ్‌గా పనిచేసే ఆకు ఉంది.
సాధారణంగా మనం కూరల్లో కరివేపాకు వేసుకుంటాం. అయితే, ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇద జుట్టు, కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారికి కరివేపాకు ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. ఇది వెంట్రుకలను త్వరగా నల్లగా మార్చడంలో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది.
కరివేపాకు జుట్టులో ఇన్పెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇందులో జుట్టు పోషణకు కావాల్సిన బీటా కెరోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కరివేపాకు జుట్టును నల్లగా మార్చడంలో పనిచేస్తుంది.
కొబ్బరినూనెలో ఓ పది కరివేపాకు ఆకులు వేసి బాగా వేడిచేయాలి. నూనె సగం అయ్యే వరకు మరిగిన తర్వాత చల్లారనివ్వాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేయాలి. దీంతో మీ తెల్లజుట్లు అస్సలు కనిపించదు.
కొబ్బరి నూనెలో కరివేపాకు మాత్రమే కాదు కర్పూరం కూడా ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె కర్పూరం కలిపి తలకు పట్టిస్తే తలలో పేరుకున్న చుండ్రు సమస్య నుంచి బయటపడతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)