PF Withdraw Rules: ఈపీఎఫ్ఓ సభ్యులకు కీలక అప్‌డేట్. మీరు కొంతకాలం ఉద్యోగం చేసి మానేసి నిరుద్యోగిగా ఉంటే.. పీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి..? ఒకేసారి మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందా..? రూల్స్ ఏం చెబుతున్నాయి..? వివరాలు ఇలా..
EPFO Free Doorstep DLC: కేంద్రంలోని మోదీ సర్కార్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ కొనసాగింపునకు ప్రతి ఏడాది తప్పనిసరిగా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ ను ఇక నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి నుంచే పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Provident Fund Interest: ప్రైవేట్ రంగంలో పని చేసే చాలా మందికి ఒక భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. లేఆఫ్స్, కాంట్రాక్ట్ ముగింపు, కంపెనీ క్లోజ్… కారణం ఏదైనా కావచ్చు. ఇంకొందరు మాత్రం స్వచ్ఛందంగా ఉద్యోగం మానేసి, కొంతకాలం విరామం తీసుకుంటారు. కానీ ఉద్యోగం పోయిన వెంటనే అందరి మైండ్‌లో వచ్చే మొదటి ప్రశ్న ఒక్కటే.. ఇప్పుడు నా PFకి ఏమవుతుంది? డబ్బు అలాగే ఉంటుందా? వడ్డీ వస్తుందా?
Pradhan Mantri Vikas Bharat Rozgar Yojana EPFO Scheme News: కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతా ఉన్నవారికి కేంద్ర PMVBRY పథకం కింద ప్రతి ఏడాది రూ.15,000 ఫ్రీగా జమ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే, ఈ పథకానికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
EPFO BHIM APP: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యుల కోసం మరో కీలక డిజిటల్ మార్పు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటివరకు ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు సమయం ఎక్కువగా తీసుకునే ప్రక్రియగా ఉండగా.. ఇకపై అది చాలా సులభంగా.. వేగంగా మారనుంది. BHIM UPI యాప్ ద్వారా తక్షణ PF అడ్వాన్స్ విత్ డ్రా సౌకర్యాన్ని EPFO త్వరలో ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న 30 కోట్లకు పైగా EPFO సభ్యులకు నేరుగా లాభం చేకూరనుంది.
EPFO 2025: ఈపీఎఫ్ఓలో కొత్త బోనస్‌లతో పాటు ప్రయోజనాలు ఏమిటనేది చాలా మందికి తెలియదు. 10 సంవత్సరాల తర్వాత PF పెన్షన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి..? 15 యేళ్ల తర్వాత తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. ? ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యొక్క కొత్త నియమాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
EPFO Latest News: పీఎఫ్ వినియోగదారుల ప్రయోజనం కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎప్పటికప్పుడు అనేక మార్పులు తీసుకువస్తోంది. ఈ ఏడాది గత పది నెలల్లో సేవలను సులభతరం చేస్తూ.. కీలక నియమాలను మార్చింది. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ నుంచి పెన్షన్ లిమిట్ వరకు ఈపీఎఫ్‌ఓ తీసుకువచ్చిన 8 మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
EPFO Big Update: భారతీయ కంపెనీలలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు కూడా ఇకపై EPFO సభ్యులుగా తప్పనిసరిగా చేరాలి. వారి ఆదాయం ఎంత ఉన్నా, వారు EPFకి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. పదవీ విరమణ లేదా అనారోగ్యంతో పని చేయలేని స్థితిలో మాత్రమే పూర్తి నిధి పొందవచ్చని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
EPFO Passbook Lite: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తమ సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు మరో కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఇప్పుడు పీఎఫ్ ఖాతా వివరాలను తెలుసుకోవడం కోసం వేరే సైట్‌కి వెళ్లి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా, అదే EPFO మెంబర్ పోర్టల్‌లోనే పీఎఫ్ లావాదేవీలను సులభంగా చూడగలిగే విధంగా ‘పాస్‌బుక్ లైట్ (Passbook Lite)’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Employee Enrollment Scheme 2025 Full Details: కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ శనివారం ఉద్యోగుల నమోదు పథకం 2025 (Employee Enrollment Scheme 2025)ను ప్రారంభించారు. ఈ స్కీమ్‌ను యజమానులు స్వచ్ఛందంగా అర్హులైన ఉద్యోగులను ప్రకటించి.. ఈపీఎఫ్‌లో నమోదు చేసుకునేలా ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకువచ్చారు. వివరాలు ఇలా..
PF Balance: మీరు ఇంట్లో కూర్చుండి.. ఆన్ లైన్ లో సులభంగా కొంత మొత్తంలో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు కూడా దీని కోసమే చూస్తున్నట్లయితే ఈపీఎఫ్ నుంచి డబ్బు ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.
EPFO Free Insurance Scheme: మరణం చెప్పి రాదు. ప్రతి ఉద్యోగి జీవితంలో ఆకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలెన్నో ఉంటాయి. ఉద్యోగులు మరణిస్తే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నవారికి ప్రత్యేక వెసులుబాట్లు కల్పించారు కాబట్టి వారి కుటుంబం ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ చిన్న సంస్థలో తక్కువ జీతానికి పనిచేస్తూ ఇంటి ఖర్చులను నెట్టుకువస్తున్న వారి కుటుంబాలకు తీవ్ర ఇబ్బంది ఉంటాయి. ఆ సమయంలో ఉద్యోగి జమ చేసుకున్న ఈపీఎఫ్ఓతోపాటు మరో కీలకమైన భద్రత తోడుగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో 1976లో ప్రారంభమైన ఈస్కీమ్ ఉద్యోగుల
PF Money Divorce: ఏ ఉద్యోగి అయినా రిటైర్మెంట్ తర్వాత తమ పీఎఫ్ డబ్బు వారికి ఎమర్జెన్సీ ఫండ్ మారుతుంది. ప్రతి సంవత్సరం అటువంటి PF డబ్బుపై వడ్డీ కూడా చెల్లిస్తారు. PFలో పెన్షన్ పథకం కూడా అమలు చేశారు. అందువల్ల ఉద్యోగి జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న PF డబ్బు, భార్యాభర్తల మధ్య వైవాహిక సమస్య తలెత్తి వారు విడాకులు తీసుకుంటే, దానిని ఎవరికి ఇవ్వాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
EPF withdrawal process: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) భారతదేశంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో జీతం పొందే ఉద్యోగులకు కీలకమైన పొదుపు పథకం. EPFO నుండి PF డబ్బును ఉపసంహరించుకోవడం ఇప్పుడు చాలా సులభం, ఇది పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది.
EPFO Jobs: మీరు డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకూ గుడ్ న్యూస్. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గోల్డెన్ ఛాన్స్ మీకోసం అందిస్తోంది. ఎన్ఫోర్సెమెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
EPFO Update: కేంద్రంలోని మోదీ సర్కార్ ఈమధ్యే ఈపీఎఫ్ఓ 3.0 పేరుతో పెద్ద ఎత్తున సంస్కరణ తెచ్చేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఈపీఎఫ్ కింద విత్ డ్రా లిమిట్ ను లక్ష నుంచి ఏకంగా ఐదు లక్ష రూపాయల వరకు పెంచిన సంగతి తెలిసిందే. అంతే కాదు పిఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఇకపై ఏటీఎం ద్వారా కూడా అనుమతిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రత్యేకమైన ఏటీఎం కార్డు విడుదల చేయనున్నారు.
EPS-95 Pension Hike Updates: ఈపీఎఫ్ సభ్యులకు త్వరలోనే భారీ గిఫ్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పెన్షనర్లు, కార్మిక సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం కనీస పెన్షన్ ఉండగా.. రూ.7,500 కు కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని ఆశిస్తున్నారు. ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద కనీస పెన్షన్ సహా పెన్షనర్ల డిమాండ్లపై మోదీ సర్కార్ ఇటీవల సానుకూలంగా స్పందించింది. పెన్షనర్ల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇవ్వడంతో కనీస పెన్షన్ పెంపుపై ఆశలు చిగురించాయి.
EPFO Interest Latest Updates: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీని ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాదారుల అకౌంట్స్‌లో జమ చేయడం ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించకపోయినా.. కొంతమంది సభ్యుల ఖాతాల్లో వడ్డీ మొత్తం జమ అవుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPFO 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తున్న విషయం తెలిసిందే.
EPFO Latest Updates: ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్ నుంచి కొంత మొత్తంలో కట్ చేసి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. అంతే మొత్తంలో కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తుంది. కంపెనీ డిపాజిట్ చేసిన మొత్తంలో 3.67 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లోకి.. 8.33% ఈపీఎస్ ఖాతాలో జమ అవుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. పదవీ విరమణ చేసిన అనంతరం పీఎఫ్ ఖాతాదారులకు ఎంత పెన్షన్ వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
EPFO Latest News: ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి కంపెనీ మారిన ప్రతిసారి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాను కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్‌ను మరింత సులభతరం చేసింది. గతంలో కంపెనీ మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ బదిలీ చేసుకోవాలంటే ఆ కంపెనీ అనుమతి తప్పనిసరి అవసరం. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేరుగా పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.