Oppo F25 Pro 5G Vs Oneplus Nord Ce 3: ప్రాసెసర్‌, ఫీచర్స్‌, కెమెరా పరంగా ఈ రెండు మొబైల్స్‌లో ఇదే చాలా బెస్ట్‌..

Oppo F25 Pro 5G Vs Oneplus Nord Ce 3: ప్రస్తుతం మార్కెట్‌లో Oppo F25 Pro 5G, OnePlus Nord CE 3 స్మార్ట్‌ఫోన్స్‌ అతి రూ. 25,000 లోపే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్‌ ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్స్‌ ఒకటే ధరలో లభించినప్పటికీ అనేక ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ మధ్య అనేక తేడాలున్నాయి. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 /6

ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిస్ల్పే వివరాల్లోకి వెళితే, ఇవి రెండు రెండు ఫోన్‌లు 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేలతో లభిస్తున్నాయి. కానీ Oppo F25 Pro 5G 90Hz రిఫ్రెష్ రేట్‌తో కొంచెం స్మూత్‌గా ఉంటుంది.

2 /6

ఈ మొబైల్స్‌కి సంబంధించిన ప్రాసెసర్స్‌ చూస్తే, Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ MediaTek Dimensity 8100 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటే, OnePlus Nord CE 3 మొబైల్‌ Snapdragon 695G SoC ప్రాసెసర్‌తో లభిస్తోంది. ఈ మొబైల్స్‌కి సంబంధించి ప్రాసెసర్లలో Oppo F25 Pro 5G మొబైల్‌ది ఎంతో శక్తివంతమైనది.  

3 /6

ఇక Oppo F25 Pro 5G, OnePlus Nord CE 3 స్మార్ట్‌ఫోన్స్ కెమెరా వివరాల్లోకి వెళితే, Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రధాన సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక OnePlus Nord CE 3 మొబైల్ 48MP ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 

4 /6

ఈ రెండు ఫోన్‌లు 4500mAh బ్యాటరీలను కలిగి ఉంటాయి. అయితే Oppo F25 Pro 5G మొబైల్‌ 44W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. OnePlus Nord CE 3 స్మార్ట్‌ఫోన్‌ 65W ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కాబట్టి చార్జింగ్‌ పరంగా OnePlus Nord CE 3 స్మార్ట్‌ఫోన్‌ చాలా బెస్ట్‌.

5 /6

Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ Android 14తో ColorOS 14పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ అదనంగా IP65 వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇక OnePlus Nord CE 3 స్మార్ట్‌ఫోన్‌ Android 13తో OxygenOS 13.1పై నడుస్తుంది.

6 /6

చివరిగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్‌ అంటే.. స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడాలనుకునేవారికి Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ చాలా బెస్ట్‌. ఫాస్టర్ చార్జింగ్ తక్కువ ధరతో మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి OnePlus Nord CE 3 మొబైల్‌ గొప్ప ఎంపికగా భావించవచ్చు.