Palakura Egg Porutu: పాలకూరతో కోడిగుడ్డు పొరటు ఇలా చేయండి.. మళ్లీ ఇదే రిపిపీ చేసుకుంటారంటే నమ్మండి!

Palakura Egg Porutu Recipe: పాలకూర అంటేనే ఇందులో విటమిన్స్‌ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్‌ ఏ ఉంటుంది. కంటి చూపుకు ఎంతో మంచిది. అంతేకాదు ఇందులో ఉండే ఐరన్‌ కూడా మనకు ఎంతో అవసరం. మనం అప్పుడప్పుడు అందుకే పాలకూరతో రిసిపీలు తయారు చేసుకుంటాం. ఎక్కువ శాతం పాలకూర పప్పు, ఫ్రై చేసుకుంటాం. ఎప్పుడైనా మీరు పాలకూరతో పొరుటు తయారు చేసుకున్నారా? అబ్బో దీని రుచి ఎంత బాగుంటుంది తెలుసా?
 

1 /7

Palak Egg Porutu Recipe: గుడ్డుతో కూడా మనం ఎన్నో రిసిపీలు తయారు చేసుకుంటాం. కానీ, ఇలా కాస్త భిన్నంగా పాలకూరతో కోడిగుడ్ల పొరటు తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.  

2 /7

గుడ్లలో కూడా విటమిన్ డీ ఉంటుంది. ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలని డాక్టర్‌లు చెబుతారు. గుడ్లను ఏదో విధంగా తయారు చేసుకుని తింటాం. ఈసారి ఇలా పాలకూరతో కోడిగుడ్డు పొరటు చేయండి. మళ్లీ ఇదే రిపిపీ చేసుకుంటారంటే నమ్మండి.  

3 /7

పాలకూర ఎగ్‌ పొరుటు ఒక్కసారి తయారు చేశారంటే మళ్లీ మళ్లీ ఇదే తయారు చేసుకుంటారు. పాలకూరలో గుడ్డు వేసి తయారు చేస్తారు. దీంతో ఈ కూర రుచి మరింత పెరుగుతుంది. ఆ రిసిపీ ఏంటో తెలుసుకుందాం.  

4 /7

కావాల్సిన పదార్థాలు.. పాలకూర-4 కట్టలు, గుడ్లు-4, ఉల్లిపాయ- కప్పు సన్నగా తరిగినది, పచ్చిమిర్చి-8, నూనె -కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, కారం- ఒక స్పూన్‌, ధనియాల పొడి- స్పూన్‌

5 /7

పాలకూర ఎగ్‌ పొరటు తయారీ విధానం.. ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసి బాండీ పెట్టి నూనె వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత పసుపు, కారం వేసుకుని కలపాలి. పాలకూర, ఉప్పు కూడా వేసి కలపండి.

6 /7

ఆ తర్వాత నూనె పైకి తేలుతుంది. ఇందులో మీరు ఉల్లిపాయ వేసిన తర్వాత కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా బీట్‌ చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండండి.  

7 /7

గుడ్డు పొరటు మాదిరి తయారు అవుతుంది. ఓ 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేస్తే సరిపోతుంది.ఎంతో రుచికరపైన కోడిగుడ్డు పాలకూర పొరటు రెడీ అయినట్లే. ఇది అన్నం, చపాతీలోకి కూడా బాగుంటుంది.