Portable AC: ఇంట్లో ఎక్కడైనా జరుపుకునే పోర్టబుల్ మూవింగ్ ఏసీ వచ్చేసింది

Portable AC: అద్దె ఇంట్లో ఉండేవారికి ఏసీలతో ఎప్పుడూ సమస్యే ఉంటుంది. ఇన్‌స్టాల్లేషన్ ఒక సమస్య అయితే గోడకు రంధ్రం చేసేందుకు ఇంటి యజమాని అనుమతి తీసుకోవడం వంటి ఇబ్బందులుంటాయి. అయితే ఈ పోర్టబుల్ మూవింగ్ ఏసీ అమర్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

1 /6

ప్రస్తుత రోజుల్లో ఏసీ అనేది సాధారణమైపోయింది. సొంత ఇంటివారికి కాదు గానీ అద్దె ఇంట్లో ఉండేవారికి సమస్యే. ఇంటి యజమానితో చికాకు ఉంటుంది. గోడకు రంధ్రాలు కొట్టేందుకు ఇంటి యజమాని అంగీకరించకపోవచ్చు.

2 /6

అందుకే ఇప్పుడు మార్కెట్‌లో కొత్తగా వస్తున్న ఏసీ ఈ సమస్యలకు సమాధానం చెబుతుంది. ఎక్కడా ఏం పగలగొట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడికి ఈ ఏసీని అమర్చుకోవచ్చు.

3 /6

ఇదొక పోర్టబుల్ ఏసీ. కూలర్‌లానే ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మంచి కూలింగ్ అందిస్తుంది. ఈ పోర్టబుల్ ఏసీని ఒక గది నుంచి మరో గదికి మార్చుకోవచ్చు కూడా.

4 /6

పోర్టబుల్ ఏసీలో కేవలం అడ్జస్ట్ పైపులైన్ ఉంటుంది. ఇది వేడి గాలిని బయటకు పంపిస్తుంది. ఇంట్లో చల్లదనాన్ని అందిస్తుంది. 

5 /6

ఈ పోర్టబుల్ ఏసీ కూడా ఇతర ఏసీల్లానే 1 టన్, 1.5 టన్ లేదా 2 టన్ ఉంటుంది. మార్కెట్‌లో ఇప్పటికే చాలా కంపెనీలు పోర్టబుల్ ఏసీలు లాంచ్ చేశాయి,. 

6 /6

1 టన్ పోర్టబుల్ ఏసీ 30-35 వేలుంటుంది. అదే 2 టన్ ఏసీ అయితే 40-45 వేలుంటుంది