Ram Charan Daughter: ఇంట్లో పిల్లలను చూసుకునే ఆయా కదా తక్కువ చేయకండి. రామ్ చరణ్, ఉపాసనల కూతురు క్లీంకారాతో పాటు పలువురు సెలబ్రిటీల పిల్లలను చూసుకునే ఈ ఆయా జీతం బడా కంపెనీల సీఈవోల కంటే ఎక్కువే. ఇంతకీ ఎవరామె ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..
Ram Charan Daughter: రామ్ చరణ్, ఉపాసన లకు పెళ్లైన దాదాపు దశాబ్దం తర్వాత వీళ్ల ఇంట్లోకి కొత్త అతిథిగా క్లీంకారా వచ్చింది. క్లీంకార రాకతో మెగాఫ్యామిలీలో అన్ని శుభాలే జరుగుతున్నాయి. రామ్ చరణ్ కు డాక్టరేట్ అందుకోవడం. తాత చిరంజీవి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ అందుకున్నారు.
మరోవైపు చిన్న తాత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం అవ్వడం.. ఇలా క్లీంకారా రాకతో మెగా కుటుంబంలో అన్ని శుభ శకునాలే అని చెప్పాలి. ప్రస్తుతం యేడాది వయసున్న క్లీంకారా బాగోగులను లలితా డిసిల్వా అనే ఆయా చూసుకుంటోంది.
లలితా డిసిల్వా .. సెలబ్రిటీ ఆయా అని చెప్పాలి. ముందుగా ఈమె అనంత్ అంబానీని ఆయాగా పనిచేసింది. ఆ తర్వాత కరీనా, సైఫ్ ల ముద్దుల కుమారుడిని కూడా కంటి రెప్పలా చూసుకుంది. తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతుల కూతురు క్లీంకారా బాధ్యతలను ఈమె చూసుకుంటోంది.
లలితా డిసిల్వా .. సెలబ్రిటీ ఆయా అని చెప్పాలి. ముందుగా ఈమె అనంత్ అంబానీని ఆయాగా పనిచేసింది. ఆ తర్వాత కరీనా, సైఫ్ ల ముద్దుల కుమారుడిని కూడా కంటి రెప్పలా చూసుకుంది. తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతుల కూతురు క్లీంకారా బాధ్యతలను ఈమె చూసుకుంటోంది.
లలితా డిసిల్వా ది కేరళ. అక్కడ నర్సింగ్ లో శిక్షణ తీసుకుంది. పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనేనట. 1996లో ఈమె ఫస్ట్ టైమ్ అనంత్ అంబానీ చూసుకునే నానీగా కేర్ టేకర్ గా మారింది. అలా అంబానీ కుటుంబంలో ఓ సభ్యురాలిగా మారింది.
ఆ తర్వాత 2016 డిసెంబర్ నుంచి కరీనా కుమారుడు తైమూర్ కు కేర్ టేకర్ గా లాస్ట్ ఆగష్ట్ వరకు పనిచేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ కూతురు ‘క్లీంకారా’ బాధ్యతలు చూసుకుంటోంది.
అంతేకాదు కేర్ టేకర్ గా 24 గంటలు కుటుంబానికి దూరంగా గడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈమె నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం తీసుకుంటోందట. అంతేకాదు సెలబ్రిటీల పిల్లలను చూసుకోవడానికి ‘మంత్ర’ అనే ఏజెన్సీ కూడా స్థాపించారు
మొత్తంగా కొన్ని బడా కంపెనీల సీఈవోల కంటే లలితా డిసిల్వా జీతం చాలా ఎక్కువనే చెప్పాలి. ఏది ఏమైనా లలితా డిసిల్వా ఇపుడు సెలబ్రిటీ ఆయా అన చెప్పాలి.