Rashmika Mandanna photos
రష్మిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో యమ దూసుకుపోతోంది ఈ హీరోయిన్. వరస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె.. ఇంస్టాగ్రామ్ లో కూడా తన క్రేజ్ చూపిస్తోంది.
నాగశౌర్య ఛలో చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక..విజయ దేవరకొండ గీతాగోవిందం సినిమాతో.. చెరిగిపోని ముద్ర వేసుకుంది. ఈ సినిమా ఆమెకు మంచి విజయం అందించింది. ఇక ఆ సినిమా తర్వాత నుంచి తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఇక అల్లు అర్జున్తో చేసిన పుష్ప సినిమా ఈమె కెరియర్ కి యమ బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా వల్ల ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక. ఇక ఆ తరువాత సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో యానిమల్ సినిమా.. బాలీవుడ్లో సైతం మేముకు ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టింది.
ఇక ఈ మధ్య వచ్చిన పుష్ప 2 చిత్రం ఈమెకు మరో బ్లాక్ బస్టర్ అందించింది. ఇలా వరస హిట్లు అందుకుంటూ.. సినీ ప్రపంచంలో తన హవా చూపిస్తోంది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేతిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
ఇందులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న.. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక.. ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఈమధ్య.. ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచేసింది.
ఈ క్రమంలో.. రష్మిక ఇంస్టాగ్రామ్ ఫోటోలు సైతం తెగ వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కాష్మోపోలిటన్ మ్యాగజైన్ కి రష్మిక టవల్ లాంటి టాప్ వేసుకొని.. ఇచ్చిన ఫోటోలు ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.