Realme Narzo 70 Turbo 5G Huge Price Dropped: ఎప్పటి నుంచో 15 వేల లోపే మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గతంలో మార్కెట్లోకి వచ్చిన Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా దీనిపై అదనంగా అనేక రకాల బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఈ Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌ను అత్యధిక ధరలో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. దీని ధర మార్కెట్లో రూ.16,998 కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా రూ.2,500 కూపన్ తగ్గింపు లభిస్తుంది.
అంతేకాకుండా దీనిపై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే ప్రత్యేకంగా ఈ మొబైల్‌పై అమెజాన్ ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ బోనస్‌ను పొందడానికి పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్రత్యేకమైన బోనస్ కూడా లభిస్తుంది. ఇక ఈ మొబైల్‌పై అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోనూ.. రూ.12,998కే పొందవచ్చు.
ఈ Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో లాంచ్ అయ్యింది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే 5000mAh బ్యాటరీతో విడుదలైంది.