Samantha-Naga Chaitanya: మళ్లీ కలవబోతున్న సమంత-నాగచైతన్య.. తెగ ఫీల్ అవుతున్న హీరోయిన్!

Samantha Nagachaitanya:  సమంత నాగచైతన్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఆన్ స్క్రీన్.. ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరి జంట ఎంతో ముచ్చటగా మెరిసింది. అప్పట్లో వీరిద్దరి జంటకి ఎంతోమంది అభిమానులు ఉండేవారు. అయితే వీరిద్దరి విడాకులు తీసుకొని..అభిమానుల్లో ఎంతో నిరాశను మిగిల్చారు. ఈ క్రమంలో వీరిద్దరూ మళ్లీ కలుసుకోబోతున్నారు.. అనే వార్త సోషల్ మీడియా మధ్యమాలలో వైరల్ అవుతుంది. 

1 /5

ఒకప్పుడు చూడ చక్కని జంటల్లో.. తెలుగులో ముందుగా గుర్తొచ్చే పేరు.. నాగచైతన్య-సమంత. ఏం మాయ చేసావే సినిమాతో.. సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. కాగా తన మొదటి సినిమాలో నాగచైతన్యకి జోడిగా కనిపించి.. నిజంగానే వీరిద్దరి జంట.. అందరిని మాయ చేసింది.   

2 /5

ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఆటోనగర్ సూర్య సినిమాలో కూడా కనిపించి మెప్పించారు. ఇక వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి.. అభిమానులందరూ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అభిమానుల్లో.. మరింత ఆనందం తెచ్చిపెట్టింది. దీంతో ఆన్ స్క్రీన్.. ఆఫ్ స్క్రీన్..వీరిద్దరి జంట సూపర్ హిట్ గా నిలిచింది. 

3 /5

కానీ సమస్యలు ఆ తరువాత మొదలయ్యాయి. మనం, మజిలీ లాంటి సినిమాల్లో కూడా కలిసి కనిపించిన.. ఈ జంట..ఆ తరువాత కొద్ది రోజులకి అనుకోని కారణాలవల్ల విడిపోయారు. వీరిద్దరి డైవర్స్ తరువాత నాగచైతన్య.. ఎక్కడ సమంత గురించి మాట్లాడకపోయినా.. సమంత మాత్రం పలుమార్లు నాగచైతన్య గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావిస్తూ వచ్చింది. 

4 /5

ఈ మధ్య ప్రముఖ జర్నలిస్ట్..రామారావు కూడా నాగచైతన్య సమంత విడిపోయిన కానీ.. వారిద్దరి మైండ్లో వారి పైన ప్రేమ ఇంకా అలానే ఉంది.. అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

5 /5

ప్రస్తుతం వస్తోన్న వార్తల ప్రకారం.. సమంతా నాగచైతన్యను వదిలేసి తప్పు చేసిందని ఫీలవుతున్నట్టు వినికిడి. ఈమధ్య..’మనం మన చేదు అనుభవాల దగ్గర నుంచే నేర్చుకోవాలి. మనకు ఎప్పుడూ తోడు ఉండేది మనకి దగ్గరైన మనుషులు మాత్రమే’.. అంటూ కొన్ని కొటేషన్స్ పెట్టింది. ఈ నేపథ్యంలో సమంత మళ్ళీ నాగచైతన్యతో కలిసి పోవాలని కోరుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో లేదో.. తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.