Wife and Husband: భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుండాలో తెలుసా..?

Wife and husband age gap: భార్యాభర్తల మధ్య వయస్సు పునరుత్పత్తి పై ప్రభావం చూపుతుంది అంటూ తాజాగా ఒక పరిశోధన వెల్లడించింది.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వయసు 6 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే ఇంకా మంచిదని కూడా తెలిపారు.

1 /5

ఒకప్పుడు వివాహం అంటే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం జరిపించేవారు.. కానీ ఈ మధ్యకాలంలో పెళ్లి అనేది కొంతమంది విషయంలో కొన్ని విషయాలకే పరిమితమైంది. ముఖ్యంగా వయసు. ఇందులో వయసుతో సంబంధం లేకుండా తమకంటే పెద్దవారిని లేదా చిన్న వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.   

2 /5

పురుషులు తక్కువ వయసు కలిగిన స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతుంటే, మహిళలు చాలా పెద్ద వయసున్న పురుషులను వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇకపోతే ఒకే వయసు ఉండడం లేదా కొన్ని సంవత్సరాలు తేడా ఉన్న వారిని కూడా వివాహం చేసుకుంటున్నారు. అయితే ఆడ మగ వివాహానికి వయసు తేడా ఎంత..?  దూరం పెరిగితే వచ్చే సమస్యలు ఏమిటి?అనే విషయాలపై పరిశోధన జరగగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.   

3 /5

పురుషులు తమకంటే 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న స్త్రీని వివాహం చేసుకోవాలి. ఇది వారి మనుగడ అవకాశాలను పెంచుతుందట. వివాహంలో తల్లిదండ్రుల వయసు వ్యత్యాసం పునరుత్పత్తి విజయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా అధ్యయనం చేశారు. 

4 /5

14.6 సంవత్సరాలకంటే తక్కువ వయసు.. ఉన్న స్త్రీలను వివాహం చేసుకోవడం.. పురుషుల జీవితకాల పునరుత్పత్తి విజయాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలిందట. వివాహంలో కేవలం 10 శాతం మాత్రమే స్త్రీ,  పురుషుల మధ్య తగిన వయసు తేడాను కలిగి ఉన్నట్లు పరిశోధనలో తేలింది.  భార్యాభర్తల మధ్య సగటు వయసు వ్యత్యాసం 20 ఏళ్లు పైబడిన స్త్రీలను వివాహం చేసుకోవాలట. అలాగే పురుషులు 25 సంవత్సరాల ఏళ్లు పైబడిన తర్వాత వివాహం చేసుకోవాలట.  ఇక అలా  వివాహం చేసుకున్న జంటల మధ్య మూడు సంవత్సరాల గ్యాప్ ఉండాలి అని చెబుతున్నారు. 

5 /5

ఇకపోతే వివాహ వయస్సు ఎక్కువ లేదా తక్కువ ఉంటే సమస్యలు తలెత్తుతాయట. వృద్దురాలిని లేదా చాలా పెద్ద వ్యక్తిని వివాహం చేసుకుంటే పిల్లలు కలగడంలో ఇబ్బంది తలెత్తుతుందట. ఆధునిక స్వీడన్ లోని ఇతర పరిశోధనలు వయసులో తమకంటే ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న స్త్రీని వివాహం చేసుకోవడం సరైన పునరుత్పత్తికి దారితీస్తుందని తెలిపారు.