Shani Thrayodashi Remedy: శని త్రయోదశి.. శనివారం త్రయోదశి కలిసి వచ్చినప్పుడు నిర్వహిస్తారు. రేపు అనురాధ నక్షత్రంలో శని త్రయోదశి వస్తోంది. అంతేకాదు ఇది ఈ ఏడాది చివరి శని త్రయోదశి. డిసెంబర్ 28న శని త్రయోదశి రోజు ఈ రెమిడీ పాటిస్తే మీకు ఉన్న శనిబాధలు తొలగిపోతాయి.
రేపు శని త్రయోదశి రోజు ముఖ్యంగా శని పూజ చేయాలి. వీలైనన్ని సార్లు శనీశ్వరుడు నామస్మరణ చేయాలి. అయితే, శని దోషం నుంచి విముక్తి పొందడానికి పండితులు కొన్ని పరిష్కారాలు చెప్పారు.
శని కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శని వల్ల కొన్ని రోజులు మంచి దశ, మరికొన్ని రోజులు చెడు రోజులు ఉంటాయి. అయితే, శని నుంచి విముక్తి పొందడానికి ప్రత్యేకంగా శనివారం శనీశ్వరుని దర్శనం చేసుకోవాలంటారు.
ఇది కాకుండా శని త్రయోదశి కూడా అత్యంత పవిత్రం. ఈరోజు చేసే పూజల వల్ల అశేష లాభాలు కలుగుతాయి. అయితే, శనిదోషం నుంచి విముక్తి పొందడానికి రేపు కొన్ని పనులు చేయాలి.
పండితుల ప్రకారం శని త్రయోదశి రోజు ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి శనీశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఎవరినీ కాలతో తాకకూడదు, ఈరోజు దానానికి ప్రాముఖ్యత కలిగింది.
ముఖ్యంగా ఈరోజు పెద్దవారిని అవమానించకూడదు. ముగజీవాలకు ఆహారం పెట్టాలి. పేదవారికి ఆహారం, ఏవైనా వస్తువులు దానంగా ఇవ్వాలి. ముఖ్యంగా శని దేవునికి నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి. శని చాలీసా పఠించాలి.
అంతేకాదు శని దోషాలు ఉంటే శనివారం ఇనుమును దానంగా ఇవ్వండి. అబద్దాలు చెప్పకూడదు. అనవసరంగా ఇతరులను తిట్టకూడదు. అంతేకాదు రేపు మద్యం, మాంసం పొరపాటున తీసుకోకూడదు.
శని త్రయోదశి రోజు శనీశ్వరునికి పూజలు చేసి ఈ పనులు చేస్తే దోషం నుంచి విముక్తి పొందుతారు. మార్గశిర మాసంలో శని త్రయోదశి అద్భుతమైన తిథి. మీన, కర్కాటక, వృశ్చికంలో శని నక్షత్రం ఉంటుంది. కాబట్టి వచ్చే ఏడాది శని రాశి మారుతున్నాడు.
శనివల్ల 12 రాశులు ప్రభావితం అవుతాయి. విష్ణు అనుగ్రహం పొందడానికి రావిచెట్టుకు మీన, మేష, కర్కాటక రాశివారు నారాయాణాయ నమః అని 27 ప్రదక్షిణలు చేయాలి. తూర్పు వైపు కూర్చొని విష్ణు అష్టోత్తరం పఠించాలి.
ఆ తర్వాత రాగి చెంబులో నీటిని రావిచెట్టుకు పోయాలి. సాయంత్రం శివాలయానికి వెళ్లి శివాయనమః అని 27 ప్రదక్షిణలు చేయాలి. నల్ల నువ్వుల ఉండలు పెట్టాలి. హనుమాన్, శివ, కాలభైరవ చాలీసా, దత్త కవచం 11 సార్లు చేయాలి.