IPO Week: షేర్ మార్కెట్లో ఈ వారం కొత్త కొత్త ఐపీవోలతో బిజీగా ఉంటోంది. కొత్త ఐపీవోలు చాలా వరకూ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. వివిధ కంపెనీల ఐపీవోల ద్వారా మార్కెట్ నుంచి 7,380 కోట్ల రూపాయలు సేకరించాలనేది లక్ష్యంగా ఉంది. వేర్వేరు ఐపీవోల్లో 2.6 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడి పెట్టారు.
అదే విధంగా 501 కోట్ల గాంధార్ ఆయిల్ రిపైనరీ పబ్లిక్ ఇష్యూకు 64 రెట్ల దరఖాస్తులు వచ్చి చేరాయి. ఈ ఇష్యూ కోసం 22,639 కోట్ల రూపాయలు డిమాండ్ ఉంది.
టాటా టెక్నాలజీస్ ఐపీవో గత రెండు దశాబ్దాల్లో టాటా గ్రూప్ తొలి పబ్లిక్ ఇష్యూ. దీనిని 69 రెట్లకు పైగా సబ్స్క్రిప్షన్స్ లభించాయి. 3,043 కోట్ల ఇష్యూ సైజ్ కోసం 1.57 లక్షల కోట్ల డిమాండ్ ఏర్పడింది. రిటైల్ రంగంలో 16.5 రెట్ల సబ్స్క్రిప్షన్స్ లభించాయి.
ప్రైవేట్ సెక్టార్ కంపెనీల్లో ఈ రికార్డు రిలయన్స్ పవర్ పేరిట ఉంది. జనవరి 2008లో 4.8 మిలియన్ల దరఖాస్తులు లభించాయి.
ఈ వారం విడుదలైన ఐపీవోల్లో టాటా టెక్నాలజీస్ అతి పెద్దది. 7.36 మిలియన్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఐపీవో చరిత్రలో ఇదే అత్యధికం. టాటా ఐపీవో ద్వారా ఎల్ఐసీ రికార్డులు తిరగరాసింది.