Shruti Haasan: బాస్ లుక్ లో శ్రుతిహాసన్…వారేవా అనిపిస్తున్న ఫోజులు

Shruti Haasan Photos: సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలు, వీడియోల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది హీరోయిన్ శృతిహాసన్. ముఖ్యంగా తన ఫ్యాషన్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

  • Dec 30, 2023, 22:44 PM IST
1 /6

Shruti Haasan Photos: అనగనగా ఒక ధీరుదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శృతిహాసన్.. కమల్ హాసన్ కూతురుగా కాకుండా తన అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.  

2 /6

మొదట్లో వరసగా ఫ్లాపులు తెచ్చుకున్న శృతిహాసన్ ఆ తరువాత మాత్రం బ్లాక్ బస్టర్లు అందుకుంటూ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  

3 /6

ముఖ్యంగా తెలుగులో ఎవరైనా హీరో ఫ్లాపుల్లో ఉంటే చాలు.. వారి సినిమాల్లో శృతిహాసన్ నటిస్తే అవి బ్లాక్ బస్టర్ అయిపోతాయి అన్నంత పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.   

4 /6

ఇక ఈ సంవత్సరం వరసగా మూడు సూపర్ హిట్లు అందుకని మరోసారి తెలుగులో స్టార్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో నిలిచింది.  

5 /6

ఈ సంవత్సరం మొదట్లో వీరసింహారెడ్డి ..వాల్తేరు వీరయ్య చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్న శృతి.. ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం సలార్ తో బ్లాక్ బస్టర్ అందుకుంది.  

6 /6

ఈ నేపథ్యంలో శృతిహాసన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ సూట్ లో బాస్ లాగా కనిపిస్తూ.. అందరిని మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ.