New Year 2025 Good News: LIC నుంచి న్యూ ఇయర్ గుడ్ న్యూస్.. ప్రతి విద్యార్థికి ఉచితంగా రూ.40 వేల స్కాలర్‌షిప్‌.. ఇప్పుడే అప్లై చేసుకోండి..

LIC Golden Jubilee Scholarship Schemes: ద విద్యార్థులకు ప్రముఖ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసి గుడ్ న్యూస్ తెలిపింది. ప్రత్యేకమైన స్టూడెంట్ స్కాలర్షిప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఏయే కోర్సులు చేస్తున్న వారికి ఎంత మొత్తంలో స్కాలర్షిప్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
 

LIC Golden Jubilee Scholarship Schemes @ 40K : చాలామంది పేద విద్యార్థులు తమకు వచ్చిన స్కాలర్షిప్ పైనే విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉంటారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ప్రత్యేకమైన స్కాలర్షిప్లను అందించి.. విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కొన్ని కార్పొరేషన్లు కూడా వారికి ప్రత్యేకమైన స్కాలర్షిప్లను అందిస్తున్నాయి. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసి కూడా ఒక ముందడుగు వేసింది. 
 

1 /7

ప్రముఖ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసి (LIC) విద్యార్థుల కోసం ప్రత్యేకమైన గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి విద్యార్థికి దాదాపు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ప్రత్యేకమైన స్కాలర్షిప్ లభిస్తోంది. అయితే ఈ స్కాలర్షిప్ గడువు ఈరోజు ముగుస్తోంది.     

2 /7

ఎల్ఐసి(LIC) గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్‌లో భాగంగా డిప్లమా డిగ్రీ ఐటిఐ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. అంతేకాకుండా ఈ స్కాలర్షిప్లో ప్రొఫెషనల్ కోర్సులు, మెడికల్ కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా అర్హులేనని ఎల్ఐసి తెలిపింది.   

3 /7

ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఎల్ఐసి జూబ్లీ స్కాలర్షిప్‌లో భాగంగా అధిక మొత్తంలో స్కాలర్షిప్ లభించబోతోంది. ముఖ్యంగా వీరికి గరిష్టంగా రూ.40 వేల స్కాలర్షిప్ లభించబోతోంది. ఈ స్కాలర్షిప్ కోర్సులను బట్టి అందుతుందని ఎల్ఐసి వెల్లడించింది. ప్రత్యేకమైన కోర్సులు చేస్తున్న వారికి ఎక్కువ మొత్తంలో స్కాలర్షిప్ వచ్చే అవకాశాలున్నాయి.   

4 /7

ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్‌(LIC Golden Jubilee Scholarship SchemeS)లో భాగంగా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు డిసెంబర్ 23 లోపే అప్లై అప్లై చేసుకోవాలని ఎల్ఐసి వెల్లడించింది. ఈ స్కాలర్షిప్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో కూడా కొన్ని ప్రత్యేకమైన మైక్రో వెబ్సైట్స్ రన్ అవుతున్నాయి. అందులో భాగంగా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.     

5 /7

ఈ ఎల్ఐసి స్కాలర్షిప్ లో భాగంగా 10వ తరగతితో పాటు జనరల్ డిగ్రీ, ఇతర చిన్న చిన్న కోర్సులు చేస్తున్న వారికి రూ.20 వేలు మూడు విడుదలుగా పంపిణీ చేయబోతున్నట్టు ఎల్ఐసి ప్రకటించింది. రెండు విడతలు స్కాలర్షిప్ రూ.6 వేలు వస్తే.. మరో విడత రూ. 8 వేల వరకు స్కాలర్షిప్ వస్తుంది.   

6 /7

ఇక మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు ఎల్ఐసి స్కాలర్షిప్ పథకం ఒక అద్భుతమైన వరంగా భావించవచ్చు. వీరికి మూడు విడుదలుగా స్కాలర్షిప్ రూ.40 వేలకు పైగా లభిస్తుంది. ఇందులో భాగంగా రెండు విడతలు రూ.12 వేల స్కాలర్షిప్ లభిస్తే.. మరో విడుత రూ.16 వేల వరకు పొందవచ్చు.  

7 /7

ఇక ఇంజనీరింగ్ ఇతర టెక్నికల్ కోర్సులు చేసే వారికి మూడు విడుదల రూ.30 వేల వరకు స్కాలర్షిప్ పొందవచ్చు. ఇందులో భాగంగా ఎల్ఐసి వీరికి రెండు విడుదల పాటు రూ.9 వేలు అందిస్తే.. మరో విడత రూ.12 వేల వరకు స్కాలర్షిప్ ను అందిస్తోంది.