Siddarth - Aditi Rao Wedding Pics : గత కొంతకాలంగా నటుడు సిద్ధార్థ్ తో రిలేషన్ లో ఉన్న అదితి రావు హైదరి అతడితో ఏడడుగులు వేసింది. వనపర్తి లోని శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీరిద్దరూ అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావు హైదరి ఎట్టకేలకు ఈరోజు మూడుముళ్లతో ఒక్కటి అయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఈ ఏడాది మార్చి 27వ తేదీన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న శ్రీరంగాపూర్ లో శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు.
అయితే ఆ సమయంలో వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో.. ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు అంటూ పలు రకాల రూమర్స్ బయటపడ్డాయి. దీంతో స్పందించిన ఈ జంట తమ వివాహం చేసుకోలేదని, నిశ్చితార్థం మాత్రమే జరిగింది అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక తర్వాత చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈ జంట ఈరోజు రహస్యంగా అదే దేవాలయంలో వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా వీరిద్దరూ పెళ్లి బట్టల్లో చాలా అందంగా అద్భుతంగా కనిపించారని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీ రంగనాథ దేవాలయంలో అదితి రావు హైదరి, సిద్ధార్థ్ మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.
అయితే తాజాగా ఈ ఫోటోలను అదితి రావు హైదరి తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. "నువ్వే నా చంద్రుడు.. నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా నక్షత్రాలు.. నా సర్వస్వం నువ్వే" అంటూ అద్భుతమైన క్యాప్షన్ జోడించి, ఈ ఫోటోలను పంచుకోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ జంటకు సంబంధించిన ఈ ఫోటోలు చూసి అభిమానులు సెలబ్రిటీలు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక వీరిద్దరికీ ఇదివరకే వివాహం జరిగి విడాకులు అవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా చిన్ననాటి స్నేహితురాలైన మేఘనను సిద్దార్థ్ 2003లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2007లో విడాకులు తీసుకున్నారు l.అటు అదితి రావు హైదరి కూడా 2002లో సత్యదీప్ మిశ్రామి వివాహం చేసుకొని 2012లో అతడికి విడాకులు ఇచ్చింది. ఇక ఇప్పుడు సిద్ధార్థ తో రిలేషన్ లో ఉన్న ఈమె తాజాగా అతనితో కొత్త బంధంలోకి అడుగుపెడుతోంది.