Singer Sunitha: ఉదయభానుతో గొడవ నిజమే.. రూమర్స్ పై సునీత క్లారిటీ..!

Udaybhanu vs Singer Sunitha: టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ గా ,డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరుపొందిన సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. అయితే గతంలో యాంకర్ ఉదయభాను విషయంలో జరిగిన ఒక గొడవ పైన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సింగర్ సునీత పలు విషయాలను తెలియజేసింది. వాటి గురించి చూద్దాం. 
 

1 /5

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే సింగర్ ఉష, యాంకర్ భానుప్రియ తో వున్న గొడవలపై  క్లారిటీ ఇచ్చింది. సునీత మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో తాను ఎవరితో కూడా ఎప్పుడు  గొడవ పడిన సందర్భాలు లేవని, తనతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే, తనతో డైరెక్ట్ గానే మాట్లాడవచ్చని.. అలాగే తనతో ఇబ్బంది ఉన్నా కూడా తనతోనే డైరెక్ట్గా మాట్లాడొచ్చని తెలిపింది సింగర్ సునీత. 

2 /5

సినీ ఇండస్ట్రీలో తనని అపార్థం చేసుకున్న వారి లిస్టు పెద్దగానే ఉందని, అది కూడా ఈ మధ్యనే అర్థం అయ్యిందని తెలిపింది. అలాంటి వారిలో యాంకర్ ఉదయభాను కూడా ఒకరని తెలియజేసింది. ఒక ప్రోగ్రాం  చేయడానికి  తనను ఇన్వైట్ చేశారని .. అయితే అందులో యాంకర్ ఉదయభాను ను కూడా పిలిచారు.   

3 /5

అయితే యాంకర్ గా ఉదయభాను చేయడానికి వస్తున్న సమయంలో.. నేను పాడిన పాటకు, మ్యూజిక్ ప్లే చేసే వారందరూ కూడా  నీరసమైన రాగం అందించారని, ఉదయభాను రావడం సునీతకు ఇష్టం లేదనే విధంగా కొంతమంది రూమర్లు సృష్టించారని తెలిపింది. 

4 /5

ఉదయభాను అక్కడికి రావడంతో సింగర్ సునీత జెలసీగా ఫీల్ అయ్యిందని రూమర్స్ క్రియేట్ చేసారు. కానీ నాకు అక్కడ జెలసీగా ఫీల్ అయ్యే విషయం కనిపించలేదని తెలిపింది సింగర్ సునీత. అందుకే అప్పటినుంచి ఉదయభాను, సింగర్ సునీత మధ్య గొడవలు మొదలయ్యాయి అనే విధంగా  రూమర్స్ వినిపించాయని తెలిపింది సునీత. అయితే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఉదయభానునే  డైరెక్ట్ గా నా పేరు చెప్పకుండా స్టేట్మెంట్ ఇచ్చిందని తెలిపింది సునీత. ఏది ఏమైనాప్పటికీ ఉదయభాను హర్ట్ అవ్వడం తనకు నచ్చలేదని తెలిపింది సింగర్ సునీత. 

5 /5

అయితే చాలా సందర్భాలలో కలిసినప్పుడు కూడా.. ఏంటి ఈ అమ్మాయి చాలా తేడాగా ఉంది. అసలు మాట్లాడదు. పలకరిస్తే అలా బిహేవ్ చేస్తోంది అనుకున్నాను కానీ, అయితే ఈ విషయం తనకి అప్పటివరకు తెలియదని, ఈ మధ్యనే తెలిసింది అంటూ తెలిపింది సునీత. అయితే ఈ విషయం అప్పుడే చెప్పి ఉంటే ఇన్నేళ్లు ఇలాంటి నెగెటివిటీ మోయాల్సిన పనిలేదని చెప్పేసింది సింగర్ సునీత.