హిందూమతం ప్రకారం శ్రావణ మాసానికి విశేష ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో శివుడి కటాక్షం కోసం ఇంట్లో తులసి మొక్కతో పాటు ఇంకొన్ని మొక్కలు నాటితే..శివుడు వెంటనే కరుణిస్తాడని విశ్వాసం. ఇలా చేస్తే ఆర్ధిక సమస్యల్నించి గట్టెక్కుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం శ్రావణమాసంలో ఏ మొక్కల్ని నాటాలో తెలుసుకుందాం..
Sravanam and Plants: హిందూమతం ప్రకారం శ్రావణ మాసానికి విశేష ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో శివుడి కటాక్షం కోసం ఇంట్లో తులసి మొక్కతో పాటు ఇంకొన్ని మొక్కలు నాటితే..శివుడు వెంటనే కరుణిస్తాడని విశ్వాసం. ఇలా చేస్తే ఆర్ధిక సమస్యల్నించి గట్టెక్కుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం శ్రావణమాసంలో ఏ మొక్కల్ని నాటాలో తెలుసుకుందాం..
తులసి మొక్కకు హిందూమతంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఉదయం ప్రతిరోజూ తులసి మొక్కకు పూజలు చేస్తుంటారు. ఇంటికి నార్త్ఈస్ట్ దిశలో తులసి మొక్క నాటడం వల్ల శుభసూచకంగా భావిస్తారు. తులసి మొక్కను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. తులసి మొక్క నాటడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణు భగవానుడి కటాక్షం లభిస్తుందంటారు.
షమీ మొక్కను వాస్తుశాస్త్రం ప్రకారం మంచిదిగా భావిస్తారు. షమీ మొక్కను ఇంట్లో అమర్చడం వల్ల కుటుంబసభ్యులకు లాభం కలుగుతుంది. షమీ మొక్కను పూజించడం వల్ల శనిదేవుడి కటాక్షం లభిస్తుంది. ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. తులసి మొక్కతో పాటుగా షమి మొక్కను నాటితే.అనేక లాభాలుంటాయి.
ధతురా మొక్కకు జ్యోతిష్యశాస్త్రంలో ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ మొక్కలోనే శివుడు ఆవాసముంటాడని అంటారు. అందుకే ఆదివారం, మంగళవారం రోజుల్లో ఇంట్లో బ్లాక్ ధతురా మొక్క నాటమని సూచిస్తున్నారు. అద్భుత లాభాలు కూడా ఉంటాయి. శివుడి కటాక్షం లభిస్తుంది.
చంపా మొక్కకు కూడా జ్యోతిష్యం ప్రకారం విశేష ప్రాధాన్యత ఉంది. ఇంట్లో అరటి, చంపా, కేతకీ మొక్కలు శుభసూచకంగా భావిస్తారు. ఈ మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే..అనేక లాభాలు కలుగుతాయి. చంపా మొక్క సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ మొక్కను నార్త్‌వెస్ట్ దిశలో ఉంచాలి.
అరటి మొక్కలకు జ్యోతిష్యశాస్త్రంలో ప్రాముఖ్యత ఉంది. ఇవి నెగెటివ్ శక్తుల్ని దూరం చేస్తాయి. ఇంట్లో అరటిమొక్కల్ని ఉంచడం శుభసూచకం. తులసి మొక్కలు, అరటి మొక్కలు రెండింటినీ కలిపి ఎప్పుడూ ఉంచకూడదు. ఇంటి ముఖద్వారం వద్ద కుడివైపున తులసి మొక్క, ఎడమవైపున అరటి మొక్క అమర్చుకోవాలి.