Sreeleela: కఠినమైన నిర్ణయం తీసుకున్న శ్రీలీల.. ఆశ్చర్యపోతున్న అభిమానులు..!

Sreeleela Upcoming Movies:  శ్రీ లీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా పెళ్లి సందడితోనే.. సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ హీరోయిన్. ఆ తర్వాత వరుసగా.. తొమ్మిది సినిమా ఆఫర్లు అందుకొని.. అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే తాజాగా శ్రీ లీల దూకుడు కొద్దిగా.. తగ్గినట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలో శ్రీలీలా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్..అవుతున్నాయి.

1 /5

రాఘవేంద్రరావు దర్శకత్వంలో.. శ్రీకాంత్ కొడుకు రోషన్.. హీరోగా చేసిన పెళ్లి సందడి.. సినిమా ద్వారా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను.. సంపాదించుకున్న ఈ హీరోయిన్.. ఆ తర్వాత రవితేజ ధమాకా.. చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

2 /5

అందుకు ముఖ్య కారణం రవితేజ ధమాకా.. చిత్రంలో..శ్రీలీల డాన్స్ కి లుక్స్ కి.. వందకి వంద మార్కులు.. పడడంతో.. వరుసగా తొమ్మిది సినిమా అవకాశాలు అందుకుంది. ఒకేసారి 9 అవకాశాలు.. రావడంపై అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో చర్చ జరిగింది. అయితే ఆ తొమ్మిది సినిమాలలో కేవలం ఒకటి, రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి.

3 /5

ముఖ్యంగా బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి సినిమాతో..నటన పరంగా తానేంటో ప్రూవ్ చేసుకుంది.. ఈ హీరోయిన్. అయితే శ్రీలీలకి వరస ప్లాపులు రావడంతో.. అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. 

4 /5

ఈ క్రమంలో ఈ హీరోయిన్.. ఐటమ్ సాంగ్స్ లో కనిపించనుంది అని వార్తలు రాగా.. దీనికి తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది శ్రీలీల. కొంతమంది దర్శకులు కూడా శ్రీలీలని ఐటమ్ సాంగ్స్ కోసం అప్రోచ్ అయ్యారట.. కానీ ఎందుక‌నో సెట్ అవ్వ‌లేదు. 

5 /5

తాజాగా ఈ విషయం గురించి శ్రీ లీలా మాట్లాడుతూ. 'ఇప్పుడ‌ప్పుడే ఐటమ్ సాంగ్స్ చేసే ఆలోచ‌న లేదు. అలాగని వాటిలో న‌టించ‌న‌ని.. నేను చెప్పడం లేదు. ఆ పాట‌లు చేసే స‌మ‌యం ఇంకా నాకు రాలేదు. ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చేస్తా. ప్ర‌స్తుతం నా దృష్టంతా మంచి పాత్ర‌లు , క‌థ‌లు ఎంపిక చేసుకోవ‌డంపైనే పెట్టాను’ అని చెప్పకోచ్చింది