Star Fruit: ఈ పండ్ల గురించిన తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు

Star Fruit benefits: స్టార్ ఫ్రూట్ నేది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ పండు చూడడానికి నక్షత్రం ఆకారంలో  ఉంటుంది. స్టార్ ఫ్రూట్  లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 

  • Mar 08, 2024, 18:00 PM IST
1 /5

స్టార్ ఫ్రూట్‌లో  విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. జలుబు, ఫ్లూ వంటి సమస్యలు రాకుండా  రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  

2 /5

స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.  ఇది  ఆహారం  జీర్ణం కావడానికి సహాయపడుతుంది  మలబద్ధకం ఉన్నవారికి  ప్రయోజనకరంగా ఉంటుంది.  

3 /5

స్టార్ ఫ్రూట్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది.  పొటాషియం  రక్త  పోటు నియంత్రించడానికి సహాయపడుతుంది.  గుండె  సంబంధ వ్యాధులు తగ్గుతాయి.  

4 /5

స్టార్ ఫ్రూట్‌లో కేలరీలు  తక్కువగా ఉండి  నీరు చాలా ఎక్కువగా ఉంటుంది.  బరువు తగ్గించాలనుకునే వారికి  ఇది  మంచి ఆహార ఎంపిక.  

5 /5

స్టార్‌ ఫ్రూట్‌లో విటమిన్‌ సి, బి2, బి6, బి9, ఫైబర్‌, పొటాషియం, జింక్‌, ఐరన్‌, కాల్షియం, సోడియం, ఫోలేట్, కాపర్‌, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.