Summer Drinks: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ 5 డ్రింక్స్ తప్పకుండా తీసుకోవల్సిందే

వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందుకే సాధ్యమైనంతవరకూ ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. ముఖ్యంగా కొన్ని రకాల డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా వేసవిలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.

Summer Drinks: వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందుకే సాధ్యమైనంతవరకూ ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. ముఖ్యంగా కొన్ని రకాల డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా వేసవిలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
 

1 /5

ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి. శరీరంలో విటమిన్ సి కొరత తీరిపోతుంది. బాడీని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

2 /5

లెమన్ జ్యూస్ ఇక వేసవిలో నిమ్మకాయ ప్రయోజనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. వేసవిలో తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

3 /5

గ్రీన్ టీ వేసవికాలంలో గ్రీన్ టీ తప్పకుండా తాగాలి. ఎందుకంటే శరీరాన్ని డీటాక్స్ చేయడంలో గ్రీన్ టీ కీలకంగా ఉపయోగపడుతుంది. శరీరంలో నీటి కొరత కూడా ఉండదు.

4 /5

కీరా జ్యూస్ వేసవిలో తప్పకుండా తాగాల్సిన మరో జ్యూస్ కీరా జ్యూస్. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.

5 /5

కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు వేసవిలోనే కాదు ఎప్పుడైనా సరే ఓ ఔషధం లాంటిది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే వేసవిలో ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.